
కేరళ : కేరళలోని కాసరగోడు జిల్లాలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన శాకాహార మొసలి బబియా మరణించింది. ఈ మొసలి కేరళలోని అనంతపుర గ్రామంలోని దేవాలయంలో ప్రధాన ఆకర్షణగా ఉండేది. కేవలం అన్నం మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించేది ఈ మొసలి. ఇది అనంత పద్మనాభ స్వామి ఆలయ చెరువులో ఉండేది. ఈ ఆలయ చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికీ తెలియదు. పైగా దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ అది ఎప్పుడు క్రూరంగా ప్రవర్తించలేదని.. ఆ చెరువులో ఉండే చేపలను కూడా తినలేదని ఆలయ పూజారి చెబుతున్నాడు.
ఆలయ పూజారికి మొసలికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రతీ రోజు పూజారి ఆ మొసలికి రెండుసార్లు అన్నాన్ని వేసేవాడు. ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆమె నోటికి అందించేవాడు అని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. పురాతన ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా పూర్తి శాకాహార మొసలి అని ఆలయ పూజారి చెబుతున్నాడు. పురాణాల ప్రకారం తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి మూల స్థానం ఇదేనని ఆయన ఇక్కడే స్థిర పడినట్లు భక్తులు విశ్వసిస్తారు. అదిగాక ఈ బబియా అనే మొసలి ఆలయాన్ని రక్షించడానికి దేవుడు నియమించిన సంరక్షకురాలు అని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
బాబోయ్.. పిజ్జాలో గాజు ముక్కలు.. తింటుంటే పంటికిందికి.. కస్టమర్ కు చేదు అనుభవం..
కేరళలోని కాసర్‌గోడ్‌లోని శ్రీ ఆనందపద్మనాభ స్వామి ఆలయంలో ప్రముఖ శాఖాహార ఆలయమైన మొసలి బాబియా ఆదివారం కన్నుమూసింది. బబియా, 75 ఏళ్ల వయసున్న మొసలి. ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రధాన ఆకర్షణలలో ఈ మొసలి కూడా ఒకటి. ఆలయ పూజారుల కథనం ప్రకారం, ఈ దైవిక మొసలి ఎక్కువ సమయం తన గుహలోనే గడిపేది. మధ్యాహ్నం మాత్రమే బయటకు వచ్చేది. భగవంతుడు అదృశ్యమైన గుహను ఆ మొసలి కాపాడుతుందని స్థానికులు నమ్ముతారు.
ఆలయంలోని పూజారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మొసలి రోజుకు రెండుసార్లు ఆలయంలోని పూజారి అందించే ప్రసాదం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తుంది. ఆలయ ప్రాంగణంలో బబియా ఫోటోలు విస్తృతంగా కనిపిస్తాయి. బాబియా చెరువులోకి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు.