వరుడు తాళి కట్టడు, పెళ్లికి రాకూడదు: అతనికి బదులు సోదరితో పెళ్లి తంతు

Siva Kodati |  
Published : May 27, 2019, 09:44 AM IST
వరుడు తాళి కట్టడు, పెళ్లికి రాకూడదు: అతనికి బదులు సోదరితో పెళ్లి తంతు

సారాంశం

భారత దేశంలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా వివాహ ఆచారాలు వేరు వేరుగా ఉంటాయి. ఈ క్రమంలో పెళ్లి తంతు ముగిసే వరకు వరుడి మొహం చూడనే కూడదు, పైగా పెళ్లి అయ్యే వరకు పెండ్లి కుమారుడికి బదులు అతని సోదరి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. 

విచిత్రంగా ఉన్న ఈ ఆచారం గుజరాత్‌లోని సుర్ఖేదా, సనాదా, అంబల్ గ్రామాల్లో నివసించే ఆదివాసీలు ఇదే సంప్రదాయాన్ని ఫాలో అవుతారు. పెళ్లిలో వధువులాగే వరుడి పెళ్లి కానీ సోదరి కూడా సింగారించుకుని వధువు మెడలో తాళి కడుతుంది. ఒకవేళ పెళ్లి కొడుక్కి సోదరి లేకపోతే వారి బంధువుల్లో ఎవరో ఒక పెళ్లికాని యువతి వధువు మెడలో తాళి కడతారు. 

ఈ సంప్రదాయం వెనుక: ఈ ప్రాంతంలోని ఆదివాసీలు పూజించే దేవతలు బ్రహ్మచారులు.. వీరి గౌరవార్ధం మగవాళ్లెవరూ నేరుగా పెళ్లి చేసుకోకుండా ఇలా వరుడి సోదరితో పెళ్లి తంతు జరిపిస్తారు.

అయితే వరుడు మాత్రం అందంగా ముస్తాబవ్వాలి.. కానీ పెళ్లికి మాత్రం రాకూడదు. ఇంటిని దాటి బయటకు రాకూడదు. అలాగే తన ముఖాన్ని ఎవరికీ చూపించకూడదు. అందుకే తనతో పాటు తన తల్లిని కాపలాగా పెట్టి అతడిని ఇంట్లో వదిలిపెట్టి వెళతారు.

అనంతరం వరుడి సోదరి వధువును పెళ్లి చేసుకుని ఆమెను అత్తారింటికి తీసుకువచ్చి తన సోదరుడికి అప్పగించాలి. అయితే ఈ సంప్రదాయాన్ని పాటించకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారి బంధం సరిగా సాగదని అక్కడి వారి నమ్మకం. ఇలా ఈ నియమాన్ని ఉల్లంఘించి రెండు పెళ్లిళ్లు జరిపే ప్రయత్నం చేయగా అవి మధ్యలోనే ఆగిపోయాయట. 

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi Visits Somnath Temple: సోమనాథేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మోదీ | Asianet Telugu
Richest Village: 17 బ్యాంకులు, రూ. 7 వేల కోట్లు ఎఫ్‌డీలు.. ఆసియాలోనే ధ‌నిక గ్రామం మాధాప‌ర్ విశేషాలు