లోక్‌సభ ఫలితాల ఎఫెక్ట్: కర్ణాటకలో కాంగ్రెస్ నేతల చూపు బీజేపీ వైపు

By Siva KodatiFirst Published May 26, 2019, 5:11 PM IST
Highlights

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 28 స్థానాల్లో బీజేపీ 25 స్థానాలు గెలుచుకోవడంతో దాని ప్రభావం కర్ణాటక రాజకీయాలపై స్పష్టంగా పడుతోంది

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 28 స్థానాల్లో బీజేపీ 25 స్థానాలు గెలుచుకోవడంతో దాని ప్రభావం కర్ణాటక రాజకీయాలపై స్పష్టంగా పడుతోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళీ, సుధాకుర్ ఆదివారం బీజేపీ నేత ఎస్ఎం కృష్ణతో సమావేశమవ్వడం కలకలం సృష్టించింది.

బెంగళూరులోని కృష్ణ నివాసంలో జరిగిన ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ పార్టీ మారే ఉద్దేశ్యంతోనే బీజేపీ నేతలతో సమావేశం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి.

దీంతో వీటిని ఎమ్మెల్యే రమేశ్ తోసిపుచ్చారు. ఇది రాజకీయ పరమైన సమావేశం కాదని, లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ ఘన విజయానికి శుభాకాంక్షలు చెప్పడానికే తాము ఎస్ఎం కృష్ణ నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. మరోవైపు గత కొంతకాలంగా రమేశ్ జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటిముట్టనట్లుగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 
 

click me!