కేజ్రీవాల్ 3.0: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణం

By telugu teamFirst Published Feb 16, 2020, 1:00 PM IST
Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి గా అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడవసారి ప్రమాణస్వీకారం చేసారు. తన ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీకి ఆహ్వానం పంపించానని, ఆయన బిజీగా ఉండి రాలేకపోయినట్టు తాను భావిస్తున్నట్టు తెలిపాడు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి గా అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడవసారి ప్రమాణస్వీకారం చేసారు. తన ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీకి ఆహ్వానం పంపించానని, ఆయన బిజీగా ఉండి రాలేకపోయినట్టు తాను భావిస్తున్నట్టు తెలిపాడు. 

ఆయన ఈ సందర్భంగా కేంద్రంతో కలిసిపనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రంతో కలిసి పనిచేస్తే భారత దేశం అభివృద్ధికి దోహదం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. 

ఈ మొత్తం స్పీచ్ లో ఆయన జాతి నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేకమైన దృష్టి పెడుతూ భారత పథకం గర్వంగా ఎగరాలంటే చదువు, ఆరోగ్యం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతూ... తాను చేసింది అదేనని గుర్తు చేసారు. 

ఢిల్లీలోని రామ్ లీల మైదానం పూర్తిగా ప్రజలతో కిక్కిరిసి పోయింది. ఉదయం నుండే అక్కడకు ఆప్ కార్యకర్తలు, కేజ్రీవాల్ మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథులుగా కామన్ పీపుల్ ని పిలిచాడు. ఒక లోకో పైలట్ గురించి, ఒక బస్సులో పనిచేసే మార్షల్ గురించి, టీచర్ గా రిటైర్ అయి వ్యవసాయం చేస్తున్న ఒక రైతు గురించి చెప్పాడు కేజ్రీవాల్. 

ఇక కేజ్రీవాల్ తోపాటుగా మరో 6గురు ప్రమాణస్వీకారం చేసారు. మినిస్టర్లందరూ కూడా తమ బెర్తులను నిలుపుకున్నట్టు మనకు అర్థమవుతుంది. 

ఎవరికీ ఏ అవసరం వచ్చినాసరే... వోట్ ఎవరికీ వేసినా సరే... తన వద్దకు రావచ్చని, ఏ కులం, జాతి, మతమైనా సరే తాను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నయ్ అన్నాడు. ఎన్నికల సందర్భంగా అనేక ఆరోపణలు, మాటలు, ఒక రకంగా విషం కక్కే ఆరోపణలు కూడా చేసుకున్నారని, ఎన్నికలయిపోయాయని, అన్నిటిని పక్కకు పెట్టాలని ప్రతిపక్షాలకు కూడా పిలుపునిచ్చారు. 

తాను కూడా తన మీద విమర్శలు విషపూరితమైన ఆరోపణలు చేసినవారందరిని క్షమించేశానని తెలిపాడు. ఢిల్లీ ఓటర్లకు థాంక్స్ తెలుపుతూ... కేజ్రీవాల్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు అనే విమర్శలకు చెక్ పెడుతూ మంచి కౌంటర్ ఇచ్చారు. 

భగవంతుడు సృష్టిలోని వాటినన్నిటిని ఫ్రీ గా ఇచ్చాడని, తల్లిప్రేమ తండ్రిప్రేమ ఫ్రీ ఎలానో తాను కూడా ఢిల్లీ ప్రజలకు తన ప్రేమ కూడా ఉచితం అని తేల్చిచెప్పాడు. స్కూల్లో చదువుకునే పిల్లలదగ్గర ఫీజు వసువులు చేయడం, హాస్పిటల్ లో ఫీజు వసూలు చేయడం తప్పు అని అన్నాడు. అది శాపం అని అన్నాడు. 

చివర్లో హమ్ హొంగే కామియాబ్, హమ్ హొంగే కామియాబ్ అంటూ పాట పాడుతూ ముగించాడు. కేజ్రీవాల్ ఈ మొత్తం స్పీచ్ లో ఎకాడ కూడా విపక్షాల మీద విషం చిమ్మకుండా తాను ఎం చేసాడో మాత్రమే చెప్పాడు. 

click me!