వందే భారత్ మిషన్ లో భాగంగా నేడు శనివారం రోజు ఒక విమానం న్యూఢిల్లీ నుండి మాస్కోకు రష్యాలో చిక్కుకున్నవారిని వెనక్కి తీసుకురావడానికి బయల్దేరి వెళ్ళింది. విమానం బయల్దేరి రష్యా వైపుగా ప్రయాణిస్తుండగా ఉజ్బెకిస్థాన్ గగనతలంలో ఉండగా విమానం ఇద్దరు పైలట్లలో ఒకరికి కరోనా ఉందని గుర్తించి విమానాన్ని వెనక్కి పిలిపించారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రపంచంలో నలుమూలలా భారతీయులు చిక్కుబడిపోయారు. వారందరిని భారత్ తీసుకొచ్చేనందుకు వందే భారత్ మిషన్ ను ప్రభుత్వం మొదలుపెట్టింది. భారత్ నుండి విమానాలను వివిధ దేశాలకు పంపిస్తూ అక్కడ చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకొస్తున్నారు.
ఈ వందే భారత్ మిషన్ లో భాగంగా నేడు శనివారం రోజు ఒక విమానం న్యూఢిల్లీ నుండి మాస్కోకు రష్యాలో చిక్కుకున్నవారిని వెనక్కి తీసుకురావడానికి బయల్దేరి వెళ్ళింది.
విమానం బయల్దేరి రష్యా వైపుగా ప్రయాణిస్తుండగా ఉజ్బెకిస్థాన్ గగనతలంలో ఉండగా విమానం ఇద్దరు పైలట్లలో ఒకరికి కరోనా ఉందని గుర్తించి విమానాన్ని వెనక్కి పిలిపించారు.
ఉదయం బయల్దేరిన విమానం మధ్యాహ్నం 12.30కు తిరిగి భారత్ చేరుకున్నట్టు తెలియవస్తుంది. కరోనా పాజిటివ్ పైలట్ ను ఇసోలాటిన్ వార్డుకు తరలించారు. మిగిలిన విమాన సిబ్బందిని క్వారంటైన్ కి తరలించారు.
విమానం ప్రారంభమయ్యే ముందే విమానంలోని అందరి సిబ్బంది మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. కానీ అనూహ్యంగా పైలట్ రిపోర్టు విషయంలో పాజిటివ్ రిపోర్ట్ ను నెగటివ్ గా భ్రమించడం వల్ల ఈ తప్పు దొర్లింది. ఆ తరువాత ఈ తప్పును గుర్తించి వెంటనే విమానాన్ని వెనక్కి పిలిపించారు.
ఇదిలా ఉండగా... భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యా రెండు లక్షలకు చేరువౌతోంది. శుక్రవారం ఉదయం 8గంటల సమయానికి 1,73,763 కేసులు నమోదైనట్టు అధికారులు చెప్పారు.
గత 24 గంటల్లో 8వేలకు పైగా కేసులు నమోదయినట్టు అధికారులు చెప్పారు.
ఇప్పటివరకు 82,369మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా 4,971 మంది మరణించారని తెలియవస్తుంది. ఒక్కరోజే మంది 200 మందికి పైగా ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రస్తుతం భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలో 9వ స్థానికి చేరుకుంది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. కాగా.. మరణాల్లోనూ భారత్ చైనాని దాటేయడం గమనార్హం.
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి..
కాకపోతే ఇక్కడ ఒక ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే... రికవరీ రేట్. మార్చ్ లో 7.1 శాతంగా రికవరీ రేట్ ఉండగా అది నేడు 42.75 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ మరణాల్లో కూడా గతంలో 3.3 శాతంగా ఉండగా అది 2.87 గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ పట్ల సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండండని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.... కొందరి నిర్వాకం వల్ల మాత్రం ఈ వైరస్ వ్యాపిస్తునే ఉంది.
ఇదిలా ఉండగా.. కోవిడ్ -19 పరీక్షను నిర్వహించడానికి ధరను తగ్గించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రైవేట్ ల్యాబ్‌లకు విజ్ఞప్తి చేసింది.
ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆసుపత్రులలో పరీక్షలు చేయటానికి వేచి ఉన్న ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కోవిడ్ -19 పరీక్షకు ధరను తగ్గించాలని పిలుపునిస్తూ ఐసిఎంఆర్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇదే విధమైన విజ్ఞప్తి చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 3వేలు దాటగా.. తెలంగాణ కూడా 3వేలకు చేరవలో ఉంది. గురువారం ఒక్కరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా కేసులు నమోదు కావడం బాధాకరం.