వాజ్ పేయి అభిమాన నేత ఎవరంటే...

Published : Aug 16, 2018, 06:39 PM ISTUpdated : Sep 09, 2018, 01:36 PM IST
వాజ్ పేయి అభిమాన నేత ఎవరంటే...

సారాంశం

దివంగత నేత అటల్ బిహారీ వాజ్ పేయి అభిమాన రాజకీయ నేత ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవం మన వంతవుతుంది. ఆయన అభిమాన రాజకీయ నాయకుడు భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ.  

న్యూఢిల్లీ: దివంగత నేత అటల్ బిహారీ వాజ్ పేయి అభిమాన రాజకీయ నేత ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవం మన వంతవుతుంది. ఆయన అభిమాన రాజకీయ నాయకుడు భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ.

ఆయన అభిమాన రచయితలు శరత్ చంద్ర, ప్రమే చంద్. హరివంశ్ రాయ్ బచ్చన్, రామ్ నాథ్ అవస్తి, డాక్టర్ శివ్ మంగల్ సింగ్ సుమన్, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, బాల్ కృష్ణ శర్మ నవీన్, జగన్నాథ్ ప్రసాద్ మిలింద్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఆయనకు స్ఫూర్తినిచ్చిన కవులు. 

వాజ్ పేయి మంచి వంటవాడు కూడా. కిచిడి, పూరి చకోరి, దహీ - పకోడి, పంథా, ఖీర్, మల్పువా, కౌచరి, మంగౌరి ఆయనకు ఇష్టమైన వంటకాలు. 

వాజ్ పేయి తండ్రి బయటి వంటకాలు ఇష్టపడేవారు కాదు. దాంతో ఆయన కోసం వాజ్ పేయి వంటలు చేసేవారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజ్ పేయి గురువారం అస్తమించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం