వాజ్ పేయి జీవితంలో అత్యంత చేదు ఘటన ఇదే

By pratap reddyFirst Published Aug 16, 2018, 6:26 PM IST
Highlights

అటల్ బిహారీ వాజ్ పేయి కవిత్వం ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెబుకున్నారు.  ఐదో తరగతిలో ఉన్నప్పుడు టీచర్ తనను కొట్టారని, అదే తన జీవితంలో అత్యంత చేదు ఘటన అని అన్నారు.

న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజ్ పేయి కవిత్వం ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెబుకున్నారు.  ఐదో తరగతిలో ఉన్నప్పుడు టీచర్ తనను కొట్టారని, అదే తన జీవితంలో అత్యంత చేదు ఘటన అని అన్నారు. వాజ్ పేయి జీవితంలో బయటకు వెల్లడి కాని విషయాలను విజయ్ గోయల్ సంకలనం చేశారు.  విజయ్ గోయల్ 25 నుంచి 30 ఏళ్ల పాటు వాజ్ పేయితో కలిసి నడిచారు. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తూ అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ పంపిన ఆహ్వానం వాజ్ పేయిని థ్రిల్ కు గురి చేసింది. ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో చేసిన ప్రసంగం వాజ్ పేయికి మరుపురాని జ్ఞాపకంగా ఉండిపోయింది. 

తన విజయాలకు దైవమే కారణమని ఆయన నమ్మేవారు. ఆయనకు స్ఫూర్తినిచ్చివారు తండద్రి కృష్ణ బిహారీ వాజ్ పేయి, గురు గోల్వార్కర్ జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, భవ్ రావు. దీన్ దయాల్ మరణం వాజ్ పేయి జీవితంలో అత్యంత విషాదకరమైన ఘటన.  

click me!