వీడి దుంప తెగ.. రాజకీయనాయకుడికి కోపం వచ్చి 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేశాడు..

By Bukka SumabalaFirst Published Aug 9, 2022, 8:30 AM IST
Highlights

మొండోడిని చూసి ముక్కు దాచుకోవాలని అనేది సామెత.. ఇప్పుడు రాజకీయనాయకుడి ఇంట్లో పనిచేస్తే కూడా ముక్కు దాచుకోవాల్సి వస్తుందేమో. ఈ ఘటన చదివితే మీరూ అదే అంటారు... 

లక్నో : ప్రజా ప్రతినిధులు అంటే మాటల్లో, చేతల్లో ప్రజలకు ఆదర్శంగా ఉండాలి.  మంచి చెడు చెప్పేలా ఉండాలి. కానీ ఒక్కోసారి వారు చేసే పనులతో నవ్వుల పాలవుతూ ఉంటారు.  ఓ రాజకీయ నాయకుడు ఇలాంటి పని చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఆ రాజకీయ నాయకుడికి ఎందుకో కోపం వచ్చింది. తన ఇంట్లో పనిచేసే 16 ఏళ్ల బాలుడి ముక్కు కసుక్కున కొరికేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్ పూర్ లో సోమవారం వెలుగులోకి వచ్చింది.

అభయ నాందేవ్ అనే బాలుడు.. సచిన్ సాహూ అనే రాజకీయ నాయకుడు ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్నాడు శనివారం సాయంత్రం బాలుడు చిన్న తప్పు చేశాడని కోపంతో రగిలిపోయాడు.  దీంతో సాహూ అతడు ముక్కు కొరికేశాడు. అనుకోని ఈ పరిణామానికి షాక్ అయిన బాలుడు తేరుకునేలోపే.. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలాడు.. దీంతో అతడిని మిగతావారు శనివారం రాత్రి స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఝాన్సీ వైద్యకళాశాల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు  చేయకపోవడంతో చర్యలు తీసుకోలేదని  పోలీసులు చెబుతున్నారు. 

Mahatma Gandhi Statue: నోయిడాలో వినూత్న ప్ర‌చారం.. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మహాత్ముడి విగ్రహం

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటన 2020లో తెలంగాణలో జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా, బోధన్ లోని 32వ వార్దులో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నారని ప్రత్యర్థి వర్గాలపై టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. 

అది కాస్తా పెరగడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి ఇలాయిస్ కి కోపం వచ్చింది. అంతే చటుక్కున ఇమ్రాన్ ముక్కు కొరికేశాడు. దెబ్బకు ఇమ్రాన్ ముక్కు రక్తసిక్తం అయ్యింది. రక్తస్రావం మొదలయ్యింది. దీంతో వెంటనే అక్కడున్న వారు వీరిద్దరినీ విడదీసి.. ఇమ్రాన్ ను ఆస్పత్రికి తరలించారు.

అంతకు ముందు 2019లో ఉత్తరప్రదేశ్ లో అడిగినంత కట్నం ఇవ్వలేదని అత్త ముక్కు కొరికాడో అల్లుడు. ఉత్తరప్రదేశ్ లోని బరేలికి చెందిన మహ్మద్ అష్భక్ వ్యాపారి. అతను ఏడాది క్రితం చాంద్ బీని పెళ్లి చేసుకున్నాడు. ఆ టైంలో రూ.10లక్షల కట్నం ఇచ్చాడు.. చాంద్ బీ తండ్రి రెహమాన్. ఆ తరువాత వీరికి ఓ పాప పుట్టింది. అప్పటి నుంచి మరో రూ.5లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని మహ్మద్ భార్య చాంద్ బీని వేధిస్తున్నాడు. భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం అయ్యి, భార్య చాంద్ బీపై చెయ్యి చేసుకున్నాడు. ఆమె ఈవిషయాన్నితల్లిదండ్రులకు చెప్పింది.

కూతురు ఇంటికి వచ్చిన వారు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మహ్మద్ వారి మాటలు వినలేదు సరికదా.. విచక్షణా రహితంగా దాడి చేసి.. చాంద్ బీ తల్లి ముక్కు కొరికేశాడు. తన తండ్రితో ఆమె చెవులను కోయించాడు. దీంతో తీవ్ర రక్త స్రావంతో ఆమె స్పృహ కోల్పోయింది. అది చూసిన మహ్మద్, అతని తండ్రి అక్కడినుంచి పరారయ్యారు. 

click me!