బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి, ముగ్గురు పిల్లలు పుట్టాక.. యువకుడి అరెస్ట్..

Published : Jul 22, 2021, 10:18 AM IST
బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి, ముగ్గురు పిల్లలు పుట్టాక.. యువకుడి అరెస్ట్..

సారాంశం

మైనర్ బాలికను వివాహం చేసుకుని, మూడేళ్లుగా కాపురం చేస్తున్న యువకుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

యూపీ : పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లాడి కాపురం చేసిన యువకుడిమీద పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ జిల్లాలో వెలుగు చూసింది. 15 యేళ్ల మైనర్ బాలికను మూడేళ్ల క్రితం కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడు. 

వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మైనర్ బాలికను వివాహం చేసుకుని, మూడేళ్లుగా కాపురం చేస్తున్న యువకుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుమీద కేసు నమోదు చేసిన పోలీసులు మూడేళ్ల తరువాత అరెస్ట్ చేశారు. 

నిందితుడి ఆస్తిని సీజ్ చేసి, సమాచారం అందజేసిన వ్యక్తికి రూ. 25 వేల బహుమతి ఇచ్చారు. బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకుని, మూడుళ్లు కాపురం చేసి, పిల్లలు పుట్టాక పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

వినాశకాలే విపరీత బుద్ధి..అయోధ్యలో రాములోరి కళ్లెదుటే | Ayodhya Ram Mandir Donation Theft?
Indian Railways: మరీ ఇంత కక్కుర్తా? ట్రైన్‍లో దుప్పట్లు, ఫేస్ టవల్స్ ఎత్తుకెళ్లిన ప్యాసింజర్లు..రైల్వేకు రూ.కోట్ల నష్టం