53ఏళ్ల నుంచి కోర్టులో కేసు.. సుప్రీం స్పందించే సమయానికి..!

By telugu news teamFirst Published Jul 22, 2021, 10:09 AM IST
Highlights

అతను కొనుగోలు చేయడానికి ముందే.. దాని యజమాని.. ఆ భూమిని బ్యాంకు కు తనఖా పెట్టాడు. ఈ విషయం తెలియక.. అతను ఆ భూమిని కొనుగోలు చేశాడు. దీంతో.. ఈ భూమి విషయంలో గైక్వాడ్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.

ఓ వ్యక్తి అప్పుడెప్పుడో భూమి కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ భూమికి సంబంధించి వివాదం కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. సరిగ్గా సుప్రీం కోర్టు స్పందించే  సమయానికి ఆయన కన్ను మూశాడు. ఈ కేసు కోసం ఆయన దాదాపు 53 సంవత్సరాలపాటు ఎదురు చూశాడు. సరిగ్గా సుప్రీం కోర్టు స్పందించే సమయానికి వయసు రీత్యా వచ్చిన వృద్ధాప్యం కారణంగా చనిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన 108ఏళ్ల వృద్ధుడు సోపాన్ నర్సింగ్ గైక్వాడ్ 1968లో రిజిస్టర్డ్ సేల్  ద్వారా ఓ భూమిని కొనుగోలు చేశాడు.  అయితే... అతను కొనుగోలు చేయడానికి ముందే.. దాని యజమాని.. ఆ భూమిని బ్యాంకు కు తనఖా పెట్టాడు. ఈ విషయం తెలియక.. అతను ఆ భూమిని కొనుగోలు చేశాడు. దీంతో.. ఈ భూమి విషయంలో గైక్వాడ్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.

ఈ కేసు బొంబాయి హైకోర్టులోనే 27 సంవత్సరాలు పెండింగ్ లో ఉండిపోయింది. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టుకు తరలించాలని అతను అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఈలోపు ఆయనకు 108ఏళ్లు నిండిపోయాయి. చివరకు  ఆయన కోర్టు విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

సుప్రీం అంగీకరించేలోపు.. ఆయన ప్రాణాలు వదలడం గమనార్హం. అంతకముందే ఆయన చనిపోగా.. కోర్టు అంగీకరించిన తర్వాత ఈ విషయాన్ని తెలియజేశారు. 
 

click me!