ఇండియాలో కోవిడ్: రెండు రోజులుగా 40 వేలకు పైగా కరోనా కేసులు

By narsimha lodeFirst Published Jul 22, 2021, 9:53 AM IST
Highlights


ఇండియాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రెండు రోజులుగా  వరుసగా 40వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో  41,383 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 507 మంది మరణించారు.దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 31,257,720 కరోనా కేసులు చోటు చేసుకొన్నాయి. కరోనాతో  ఇంతవరకు 4,19,021 మంది మరణించారు. కరోనా నుండి ఇప్పటివరకు 30,429,339 మంది కోలుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కరోనా రోగుల రికవరీ 99 శాతానికి చేరుకొన్నాయి. కరోనా రోగుల మృతుల సంఖ్య 1 శాతంగా నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న కూడ దేశంలో కరోనా కేసులు 40 వేలు దాటాయి.  మూడు రోజుల క్రితం వరకు కరోనా కేసులు 30 వేలకు పైగా నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్రల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.  దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,09,394 కి చేరుకొంది. 

రెండు రోజుల నుండి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కేసుల పెరుగుదలపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దేశంలో  ఇప్పటివరకు 41.78 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు. నిన్న ఒక్క రోజే 22.77 లక్షల మంది టీకాలు తీసుకొన్నారు. 


 

click me!