ఉత్తరాఖండ్‌లో మరో విపత్తు: చెలరేగిన కార్చిచ్చు, భారీగా అటవీ దగ్ధం.. నలుగురు మృతి

By Siva KodatiFirst Published Apr 4, 2021, 4:56 PM IST
Highlights

వేసవి కాలం కావడంతో ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. తాజాగా పౌరీ గర్వాల్‌, కమావు అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. శనివారం దాదాపు 62 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మంటలు సంభవించాయి.

వేసవి కాలం కావడంతో ఉత్తరాఖండ్‌ అడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. తాజాగా పౌరీ గర్వాల్‌, కమావు అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. శనివారం దాదాపు 62 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మంటలు సంభవించాయి.

ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వీటిని అదుపు చేసేందుకు అటవీ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దాదాపు 12వేల మంది సహాయ సిబ్బందిని మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

కార్చిచ్చు కారణంగా సుమారు రూ.37లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తిరత్ రావత్ స్పందించారు.

అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన.. మంటల నివారణకు భారత వాయుసేన హెలికాప్టర్లు వినియోగించాలని సూచించారు. ఈ మేరకు హెలికాఫ్టర్లు సమకూర్చాల్సిందిగా కేంద్రానికి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.   

కాగా, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. ఉత్తరాఖండ్‌ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు గురించి సీఎం తీరథ్‌ సింగ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని వెల్లడించారు.

ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అమిత్ షా సూచించారు. వెంటనే ఉత్తరాఖండ్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి వెల్లడించారు.   

click me!