ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదా సిద్ధం.. ఆగ‌స్టు 5న కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..?

Published : Jun 30, 2023, 03:25 PM IST
ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ముసాయిదా సిద్ధం.. ఆగ‌స్టు 5న కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..?

సారాంశం

Dehradun: ఉత్తరాఖండ్ లో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదా సిద్ధమైంది. ఈ నివేదికను త్వరలోనే ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామి ప్రభుత్వానికి సమర్పిస్తామని నిపుణుల కమిటీ తెలిపింది. ఇదే క్ర‌మంలో యూనిఫాం సివిల్ కోడ్‌పై ఆగస్టు 5న కేంద్రం పెద్ద ప్రకటన చేయవచ్చని బీజేపీ నేత కపిల్ మిశ్రా పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  

Uttarakhand UCC committee: ఉత్తరాఖండ్ లో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ముసాయిదాను రూపొందించారు. ఈ విషయాన్ని నిపుణుల కమిటీ ప్రకటించింది. యూసీసీ చట్టం చేస్తే మైనార్టీల పర్సనల్ లాకు అడ్డుకట్ట పడుతుందనీ, సివిల్ విషయాల్లో అందరూ ఒకే చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాష్ట్ర చట్టబద్ధ కమిషన్ తో పాటు వివిధ మత వర్గాల నాయకులతో కూడా కమిటీ సంప్రదింపులు జరిపినట్లు యూసీసీ ముసాయిదా కమిటీ సభ్యురాలు సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ తెలిపారు. ముసాయిదాతో పాటు నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

కాగా, దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ పై రాజకీయ పోరాటం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత యూసీసీపై విపక్షాలు మండిపడుతున్నాయి. యూసీసీని ప్రధాని బాహాటంగా సమర్థిస్తున్నప్పుడు లా కమిషన్ కు సలహాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముసాయిదాను రూపొందించింది.

ప్రభుత్వం ముస్లింల మత స్వేచ్ఛను హరించాలని చూస్తోందనీ, అదే జరుగుతోందని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ అన్నారు. అదే సమయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ తాము ఏ మతాన్ని నిషేధించలేదని, రాజ్యాంగంలో ఏది రాసిందో అదే చేస్తామని, ఒకే దేశంలో ఒకే చట్టం ఉండాలని అన్నారు. ఇదిలావుండ‌గా, ముస్లింలు ఏ నిర్ణయాన్ని అంగీకరించరని ఎస్పీ ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ అన్నారు. ఇది మన మతానికి సంబంధించిన విషయం. ఉలేమా ముఫ్తీలు మాత్రమే వారి నిర్ణయాన్ని అంగీకరిస్తారు. ప్రభుత్వం ఉలేమా ముఫ్తీలతో మాట్లాడాలని అన్నారు. 

బీజేపీ నేత కపిల్ మిశ్రా కీల‌క వ్యాఖ్య‌లు.. 

వచ్చే ఆగస్టు 5న యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై మోడీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని బీజేపీ నేత కపిల్ మిశ్రా అన్నారు. ఆగస్టు 5 కేంద్రానికి ముఖ్యమైన తేదీ అనీ, ఈ తేదీపై కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. తన వాదనకు మద్దతుగా మిశ్రా రామ మందిర నిర్మాణం ప్రకటన, ఆర్టికల్ 370 రద్దు తేదీని ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ యూసీసీ కమిటీ కీలక ప్రెస్ కాన్ఫరెన్స్ కు కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. "ఆగస్టు 5న రామమందిరంపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 5న సెక్షన్ 370ని తొలగించారు. ఆగస్టు 5న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)తో పాటు.. జై శ్రీరామ్" అని ట్వీట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?