ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు: మూడు మృతదేహాలు స్వాధీనం

Published : Feb 07, 2021, 04:14 PM IST
ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు: మూడు మృతదేహాలు స్వాధీనం

సారాంశం

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని మంచు చరియలు విరిగిపడిన కారణంగా ధౌలిగంగా, అలకానంద నదుల్లో ఆకస్మాత్తుగా వరదలు పెరిగిపోయాయి.ఈ ఘటనలో మూడు మృతదేహాలను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకొన్నారు.

డెహ్రాడూన్:ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని మంచు చరియలు విరిగిపడిన కారణంగా ధౌలిగంగా, అలకానంద నదుల్లో ఆకస్మాత్తుగా వరదలు పెరిగిపోయాయి.ఈ ఘటనలో మూడు మృతదేహాలను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకొన్నారు.

ఈ నదుల పరివాహక ప్రాంతాల్లోని వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్  సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.మూడు హెలికాప్టర్ల వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి. సుమారు వంద నుండి 150 మంది ఈ ప్రమాదంలో మరణించారని ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి ఒం ప్రకాష్ మీడియాకు చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం అస్సోంలో పర్యటిస్తున్న  సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. సహాయక చర్యలు చేపట్టాలని మోడీ అధికారులను ఆదేశించారు.మూడు మృతదేహాలను ఇప్పటివరకు స్వాధీనం చేసుకొన్నట్టుగా సీఎం త్రివేంద్రసింగ్ ట్వీట్ చేశారు.ఐటీబీపీ, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

వరదలతో దెబ్బతిన్ని రిషిగంగా విద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 150 మందికి చపైగా కార్మికులు లేరని ఎస్‌డిఆర్ఎఫ్ డీఐజీ రిధిమ్ అగర్వాల్ తెలిపారు. తపోవన్ ఆనకట్ట వద్ద భూగర్బ సొరంగంలో చిక్కుకొన్న 16 మందిని రక్షించి సురక్షితమైన ప్రదేశానికి తరలించినట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ ఆశోక్ కుమార్ చెప్పారు. ఎన్‌టీపీసీ, రిషిగంగా పవర్ ప్లాంట్ సైట్ లలో పనిచేస్తున్న 150 మందిని గుర్తించి రక్షించడానికి రెస్క్యూటీమ్ లు కృషి చేస్తున్నాయన్నారు.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?