ఇండియాలో సిద్ధమవుతున్న మరో ఏడు టీకాలు: హర్షవర్థన్

Siva Kodati |  
Published : Feb 07, 2021, 04:03 PM IST
ఇండియాలో సిద్ధమవుతున్న మరో ఏడు టీకాలు: హర్షవర్థన్

సారాంశం

భారతదేశంలో కోవిడ్‌ను నియంత్రించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొవాగ్జిన్, కోవిషీల్డ్‌లను అత్యవసర వినియోగానికి అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మనదేశంలోనే మరో ఏడు వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయట. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. 

కేవలం రెండు టీకాలపైనే ఆధారపడలేమని ఆయన పేర్కొన్నారు. భారత్‌ పెద్ద దేశం కావడంతో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించేలా పలు కంపెనీలు పరిశోధనలు చేస్తున్నట్లు హర్షవర్థన్ వివరించారు.

ఈ ఏడు వ్యాక్సిన్లలో మూడు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. దేశంలోని ప్రతిఒక్కరికి టీకా అందించేలా చర్యలు చేపడుతున్నామని.. వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లో ఉంచేందుకు ప్రభుత్వం వద్ద తక్షణ ప్రణాళిక ఏమీ లేదని ఆరోగ్య మంత్రి తేల్చి చెప్పారు.

ఈ అంశంపై డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని హర్షవర్ధన్‌ వెల్లడించారు. 50 ఏళ్లకు పైబడినవారికి కరోనా టీకా పంపిణీని మార్చిలో ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంలో Aviation Minister Rammohan Naidu Speech| Asianet News Telugu
Indian Army: ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం.. ఇక ఆర్మీలో కూడా ఏఐ టెక్నాల‌జీ వినియోగం