కుంపటి కొంప ముంచింది.. ఇద్దరు రైతుల్ని సజీవ దహనం చేసింది...

Published : Jan 28, 2021, 11:14 AM IST
కుంపటి కొంప ముంచింది.. ఇద్దరు రైతుల్ని సజీవ దహనం చేసింది...

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు రైతులు సజీవదహనమైన దారుణ ఘటన జరిగింది. వెచ్చదనం కోసం గుడిసెలో ఏర్పాటు చేసుకున్న కుంపటి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది.  బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని ఈటా జిల్లా పిఫారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. మృతులను కాళిచరణ్ (45), ఆయన మిత్రుడు రాధేశ్యాం (35)గా గుర్తించారు. చలి కాచుకునేందుకు వెలిగించిన కుంపటి నుంచి వచ్చిన మిరుగులుతో నిప్పంటుకుని గుడిసె దగ్ధమైందని కాళిచరణ్ సోదరుడు వెల్లడించారు. 

ఇద్దరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామనీ... తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని అదనపు ఎస్పీ ఓపీ సింగ్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !