మరో మహమ్మారికి సిద్ధంగా ఉండండి.. బిల్ గేట్స్

By telugu news teamFirst Published Jan 28, 2021, 11:05 AM IST
Highlights

ప్రపంచ దేశాలు యుద్ధానికి ఏవిధంగా అయితే.. సన్నద్ధం అవుతారో.. అదే విధంగా మరో మహమ్మారి కి ముందుగా రెడీ అవ్వాలంటూ బిల్ గేట్స్ హెచ్చరించారు. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి కాస్త కోలుకుంటున్నాం. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో చాలా మంది ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా.. ఇలాంటి సమయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చేసిన కామెంట్స్ అందరినీ విస్మయానికి గురిచేశాయి.

ప్రపంచ దేశాలు యుద్ధానికి ఏవిధంగా అయితే.. సన్నద్ధం అవుతారో.. అదే విధంగా మరో మహమ్మారి కి ముందుగా రెడీ అవ్వాలంటూ బిల్ గేట్స్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో కరోనా లాంటి మరో మహమ్మారి రాకముందే.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘ప్రపంచం నివారణ చర్యలు చేపట్టకపోతే మరో మహమ్మారి ఎప్పుడొస్తుందో చెప్పలేం. యుద్దం వస్తుందని ఎలా అయితే ముందు జాగ్రత్తలు తీసుకుంటామో మహమ్మారిని కూడా అదే విధంగా సీరియస్‌గా తీసుకోవాలి. మరో మహమ్మారి రాకుండా ఉండాలంటే ప్రతి ఏడాది బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు ఎక్కువే అయి ఉండొచ్చు.. కానీ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచానికి దాదాపు 28 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిన విషయాన్ని గుర్తుంచుకోండి. 

ట్రిలియన్ డాలర్ల నష్టం రాకూడదంటే బిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరో మహమ్మారి రాకుండా ఉండేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు ఎక్కువగా ఖర్చు చేయాలి’ అంటూ లేఖలో బిల్ గేట్స్ చెప్పారు. కాగా.. ప్రపంచాన్ని వణికించే మహమ్మారి రావొచ్చంటూ 2015లోనే బిల్‌ గేట్స్ హెచ్చరించారు. కరోనా మహమ్మారిని ఎదుక్కొనేందుకు బిల్ అండ్ గేట్స్ ఫౌండేషన్ 1.75 బిలియన్ డాలర్ల ఇన్‌వెస్ట్‌మెంట్ చేసింది. అంతేకాకుండా మరో మహమ్మారి వచ్చే అవకాశం ఉంటే ముందుగానే హెచ్చరికలు ఇచ్చేలా ఓ ప్రత్యేక బృందాన్ని బిల్ గేట్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందంలో దాదాపు 3 వేల మంది ఫుల్ టైమ్ పనిచేస్తున్నారు

click me!