ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్‌ను తీర్చిదిద్దడంలో రాష్ట్రంలోని జీఐ ట్యాగ్ ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. యోగి ప్రభుత్వం సెప్టెంబర్ 25 నుండి 29 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోను నిర్వహిస్తోంది.
లక్నో : ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్‌ను తీర్చిదిద్దడంలో రాష్ట్రం యొక్క మేధో సంపత్తి కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి యోగి ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. యోగి ప్రభుత్వం సెప్టెంబర్ 25 నుండి 29 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోను నిర్వహించనుంది.
యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన దాదాపు అన్ని జీఐ ట్యాగ్ ఉత్పత్తులు తమ బలమైన ఉనికిని చాటుతాయి. దేశ వారసత్వం, సంస్కృతికి ప్రతిరూపాలైన హ్యాండ్‌లూమ్, హ్యాండీక్రాఫ్ట్, ఆహార ఉత్పత్తుల ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని వాటిని అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో అందబాటులో వుంచనున్నారు.
undefined
ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 75 జీఐ ట్యాగ్ ఉత్పత్తులు ఉన్నాయి, వీటిలో 58 హస్తకళలు, 17 వ్యవసాయ/ ఆహార ఉత్పత్తులు జీఐ రిజిస్టర్డ్ వున్నాయి. ఇదే సమయంలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో కాశీ యొక్క గొప్ప హ్యాండీక్రాఫ్ట్ వారసత్వం, హస్తకళాకారుల నైపుణ్యం కలిగిన 23 జీఐ ట్యాగ్ ఉత్పత్తుల వైభవం ప్రపంచం చూడనుంది. దేశంలోనే మొట్టమొదటి నగరం కాశీలో అత్యధిక జీఐ ట్యాగ్ ఉత్పత్తులు ఉన్నాయని ప్రపంచానికి తెలియజెప్పనున్నారు.
జీఐ ట్యాగ్ విషయంలో యూపీ దేశంలోనే నంబర్ వన్
జీఐ నిపుణుడు పద్మశ్రీ డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ... యోగి ప్రభుత్వ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ జీఐ ఉత్పత్తిలో కూడా నంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో కేరళ ఉన్నాయి. 2014కి ముందు కాశీ ప్రాంతంలో కేవలం 2 జీఐ రిజిస్టర్డ్ ఉత్పత్తులు (బనారస్ చీరలు, భదోహి చేతితో తయారు చేసిన తివాచీలు) మాత్రమే ఉన్నాయని తెలిపారు.
2017లో యూపీలో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఐ రిజిస్ట్రేషన్ ఊపందుకుందని.... ఇప్పుడు జిఐ రిజిస్టర్డ్ ఉత్పత్తుల సంఖ్య 25కి చేరుకుందని అన్నారు. కాశీ ప్రాంతంలో జీఐ ఉత్పత్తుల వార్షిక వ్యాపారం దాదాపు 22,500 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యాపారంలో సుమారు 12 నుండి 15 లక్షల మంది ఉన్నారు. మొత్తం వ్యాపారంలో దాదాపు 30 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రపంచంలోని ప్రధాన దేశాలకు కాశీ ప్రాంతం నుండి జీఐ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారని రజనీకాంత్ తెలిపారు.
కాశీ ప్రాంతం నుండి అత్యధిక జీఐ ట్యాగ్ ఉత్పత్తులు
ఐదు రోజుల యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో కాశీ ప్రాంతం నుండి అత్యధిక జీఐ ట్యాగ్ ఉత్పత్తులు ప్రదర్శించబడతాయి. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన జీఐ ఉత్పత్తుల స్టాల్‌ల కోసం ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేశామని జీఐ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రజనీకాంత్ వెల్లడించారు.
డాక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 75 జీఐ ట్యాగ్ ఉత్పత్తులు ఉన్నాయన్నారు. వీటిలో హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్‌లూమ్, ఆహార ఉత్పత్తులలో 60 జీఐ ట్యాగ్ ఉత్పత్తులు వాణిజ్య ప్రదర్శనలో వుంటాయన్నారు. అన్ని ప్రధాన విభాగాలలో జీఐ ఉత్పత్తులను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. హస్తకళలలో అత్యధిక జీఐలు కూడా ఉత్తరప్రదేశ్ నుండే వస్తున్నాయన్నారు.
మొత్తం 75లో అత్యధికంగా 25 జీఐ ట్యాగ్ ఉత్పత్తులు కాశీ ప్రాంతానికి చెందినవే... వీటిలో 23 జీఐ ఉత్పత్తులు అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో అంతర్జాతీయంగా ప్రదర్శించబడతాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రధాన ODOP ఉత్పత్తులు కూడా జీఐ ట్యాగ్‌ను పొందాయని రజనీకాంత్ చెప్పారు.
మహిళలకు స్వావలంబనం కల్పిస్తున్న యోగి ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ రీసెర్చ్ చైర్‌పర్సన్ శిప్రా శుక్లా మాట్లాడుతూ... దేశంలో క్షీనిస్తున్న సాంప్రదాయ హస్తకళలకు జీఐ, ODOP ద్వారా యూపి ప్రభుత్వం ప్రాణం పోసిందన్నారు. దీనివల్ల మంచి ప్రావిణ్యం కలిగిన హస్తకళాకారులకు చేతినిండా పని దొరుకుతోందన్నారు. పురుశాధిక్యం కలిగిన విభాగాల్లో కూడా పెద్ద సంఖ్యలో మహిళా కళాకారులకు యోగి ప్రభుత్వం విశ్వకర్మ శ్రామిక్ సమ్మాన్ యోజన ద్వారా శిక్షణ ఇచ్చింది... దీంతో వారు కూడా మంచి ఉపాధిని పొందుతున్నారని అన్నారు.
యోగి సర్కార్ హ్యాండీక్రాఫ్ట్‌ను ప్రపంచంలోని ఇతర క్రాఫ్ట్‌లతో పోటీ పడేలా నిరంతరం కొత్త కొత్త డిజైన్లు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కళాకారులకు ఆర్థిక సహాయం, టూల్‌కిట్‌లు మొదలైన వాటిని అందించడం ద్వారా వారిని తమ కాళ్లపై తాము నిలబేలా చేసింది.