బాలిక మతమార్పిడికి ప్రయత్నం.. టీనేజర్ అరెస్ట్..

By AN TeluguFirst Published Dec 25, 2020, 4:51 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల అమల్లోకి వచ్చి యాంటీ కన్వర్షన్ ఆర్డినెన్స్ కింద  పోలీసులు ఓ టీనేజర్‌ను అరెస్ట్ చేశారు. తన పేరును మార్చుకుని పదహారేళ్ళ హిందూ బాలికను నమ్మించి, మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఈ టీనేజర్‌ను డిసెంబరు 15న అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల అమల్లోకి వచ్చి యాంటీ కన్వర్షన్ ఆర్డినెన్స్ కింద  పోలీసులు ఓ టీనేజర్‌ను అరెస్ట్ చేశారు. తన పేరును మార్చుకుని పదహారేళ్ళ హిందూ బాలికను నమ్మించి, మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. ఈ టీనేజర్‌ను డిసెంబరు 15న అదుపులోకి తీసుకున్నారు. 

బిజ్నూర్ (గ్రామీణ) పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ, ధంపూర్‌కు చెందిన పదహారేళ్ళ దళిత బాలికను నిందితుడు సకీబ్ కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. అనంతరం అతను ఆమె మతం మార్చేందుకు ప్రయత్నించాడన్నారు. ఆ బాలికను సకీబ్ కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని, బాలికను పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. 

నిందితుడిని, బాలికను ప్రశ్నించిన తర్వాత సకీబ్‌ను అరెస్టు చేశారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి, మతం మార్చేందుకు ప్రయత్నించినందుకే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సకీబ్ తన పేరును సోను అని  మార్చుకుని ఆమెకు చెప్పినట్లు విచారణలో తేలింది. చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం టీనేజర్ సకీబ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్, 2020ని నవంబరులో జారీ చేసింది. దీని ప్రకారం పెళ్లి చేసుకుంటానని చెప్తూ మత మార్పిడికి పాల్పడిన వ్యక్తికి ఒక ఏడాది నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ ఆర్డినెన్స్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

click me!