వృద్ధ దంపతుల హ‌త్య‌.. ప్ర‌ధాన సూత్ర‌ధారి 12 ఏండ్ల బాలుడు స‌హా మ‌రో ఇద్ద‌రు అరెస్టు

Published : Dec 25, 2022, 01:04 PM ISTUpdated : Dec 25, 2022, 01:37 PM IST
వృద్ధ దంపతుల హ‌త్య‌.. ప్ర‌ధాన సూత్ర‌ధారి 12 ఏండ్ల బాలుడు స‌హా మ‌రో ఇద్ద‌రు అరెస్టు

సారాంశం

Ghaziabad: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వృద్ధ దంపతులను దోచుకుని హత్య చేసిన కేసులో 12 ఏళ్ల బాలుడు సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధ దంపతుల దోపిడీ, హత్య వెనుక ప్ర‌ధాన‌ సూత్రధారి 12 ఏళ్ల బాలుడు అని పోలీసులు గుర్తించారు. 

Elderly couple robbed, murdered in Uttar Pradesh: వృద్ధ దంపతులను దోచుకుని హత్య చేసిన ఒక కేసులో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ దోపిడీ, హ‌త్య కుట్ర వెనుక మాస్ట‌ర్ మైండ్ ఒక 12 ఏండ్ల బాలుడు అని పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని సూత్ర‌ధారి, స‌హా మ‌రో ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. దీనిపై మ‌రింత ద‌ర్యాప్తు జ‌రుగుతున్న‌ద‌ని పోలీసులు తెలిపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వృద్ధ దంపతులను దోచుకుని హత్య చేసిన కేసులో 12 ఏళ్ల బాలుడు, మరో ఇద్దరిని శనివారం అరెస్టు చేసినట్లు అక్క‌డి పోలీసులు తెలిపారు. నవంబర్ 22న స్క్రాప్ వ్యాపారి ఇబ్రహీం (60) తన ఇంట్లో శవమై ఉండగా, అతని భార్య హజ్రా మెడలో గుడ్డ చుట్టుకుని ఖాళీగా ఉన్న స్థలంలోని మరుగుదొడ్డి సమీపంలో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు విచార‌ణ జ‌ర‌ప‌గా విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేరం వెనుక మైన‌ర్లు ఉన్నార‌ని గుర్తించారు. 

వృద్ధ దంపతుల దోపిడీ, హత్య వెనుక సూత్రధారి 12 ఏళ్ల బాలుడు అని పోలీసులు తెలిపారు. మైనర్ దంపతులకు తెలుసున‌నీ, ఇబ్రహీం స్క్రాప్ అమ్మడం ద్వారా చాలా డబ్బు కూడబెట్టాడని తెలుసుకున్న తరువాత దోపిడీ ప్రయత్నం కోసం మరో ముగ్గురిని త‌న‌తో చేర్చుకున్నాడు. అయితే, దోపిడీ యత్నం ఫలితంగా దంపతులు హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు.  మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరు - మంజేష్, శివమ్ లను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో నిందితుడు సందీప్ కనిపించకుండా పోయాడు. వారి వద్ద నుంచి రూ.12 వేలు, ఒక మొబైల్ ఫోన్, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని ఘజియాబాద్ సీనియర్ పోలీసు అధికారి ఇరాజ్ రాజా తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !