ఆన్‌లైన్ గేమ్‌లకు అడిక్ట్.. ఇంట్లోని నగదు, నగలు పట్టుకుని యూపీ నుంచి బెంగళూరుకు 13 ఏళ్ల బాలుడు

Published : May 31, 2023, 05:54 PM IST
ఆన్‌లైన్ గేమ్‌లకు అడిక్ట్.. ఇంట్లోని నగదు, నగలు పట్టుకుని యూపీ నుంచి బెంగళూరుకు 13 ఏళ్ల బాలుడు

సారాంశం

ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై 13 ఏళ్ల బాలుడు ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు ట్రైన్‌లో వెళ్లిపోయాడు. ఇంట్లో నుంచి రూ. 40 వేల నగదు, తల్లి నగలను సర్దుకుని పారిపోయాడు. ఇంట్లో తరుచూ తనను అడ్డుకుంటున్నారని, ఏ ఆటంకం లేకుండా తనకు ఇష్టమైన ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోవడానికి ఆ బాలుడు బెంగళూరుకు వెళ్లడం కలకలం రేపింది.  

న్యూఢిల్లీ: 13 ఏళ్ల బాలుడు. ఎప్పుడు సెల్ ఫోన్ చేతిలో పట్టుకునే ఉండేవాడు. సెల్ ఫోన్ లేదంటే.. ట్యాబ్ ఉండాల్సిందే. ఆన్ లైన్ గేమ్స్‌లో మునిగిపోయేవాడు. అంతేనా.. ఆ గేమ్స్ స్టేజ్‌లు దాటడానికి డబ్బులనూ ఖర్చు పెట్టుకునేవాడు. ఎప్పుడూ ఈ గేమ్‌ల గోల ఏమిటంటూ తల్లిదండ్రులు మధ్యలో తడుతుండేవారు. ఆ బాలుడు ఆన్‌లైన్ గేమ్‌లకు ఎంతగా అడిక్ట్ అయ్యాడంటే.. గేమ్ ఆడుతుంటే మధ్యలో మాట్లాడినా, ఆడొద్దని వారించినా డిస్టర్బ్‌గా ఫీలయ్యేవాడు. అంతటితో ఆగలేదు, తనకు ఇష్టమైన ఆన్‌లైన్ గేమ్స్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆడాలని ఇంట్లోని నగదు,  నగలు పట్టుకుని ట్రైన్ ఎక్కాడు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు వచ్చేశాడు. బెంగళూరు ఐటీ హబ్ సిటీ అని తెలిసిన ఆ బాలుడు.. అక్కడ ఆన్‌లైన్ గేమ్స్ గురించి ఇంకాస్త ఎక్కువగా సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని ఈ దక్షిణాది పట్టణాన్ని ఎంచుకున్నట్టు చెప్పాడు.

యూపీలోని కౌశాంబి జిల్లాకు చెందిన ఆ బాలుడు మే 13న ఇంటిలోని తల్లి అల్మారా నుంచి రూ. 40 వేల నగదు, రూ. 10 లక్షల విలువైన నగలను పట్టుకుని పారిపోయాడు. తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన మైనర్ కొడుకు ఇంట్లో నుంచి డబ్బులు పట్టుకుని పారిపోయాడని చెప్పింది. కేసు నమోదు చేసుకుని మూడు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ బ్రిజేశ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. సర్వెలెన్స్, సైబర్ సెల్స్ సహకారంతో ఆ అబ్బాయిని పోలీసులు త్వరగానే ట్రేస్ చేశారు. మాలూర్ వైట్ ఫీల్డ్ రోడ్డు వద్ద బాలుడిని మంగళవారం పట్టుకున్నారు. నగలనూ రికవరీ చేసుకున్నారు. బాలుడిని కౌన్సెలింగ్‌కు పంపించారు.

Also Read: కదులుతున్న కారు టాప్ పై పుష్ అప్‌లు తీసిన మందుబాబు.. వైరల్ వీడియో ఇదే

బాలుడిని ప్రశ్నించగా.. కొన్ని ఆన్‌లైన్ గేమ్స్‌లో పై స్టేజ్‌లకు వెళ్లడానికి డబ్బులు అవసరం అవుతాయని చెప్పాడు. బెంగళూరుకు వచ్చాక తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా? అని అడగ్గా.. లేదని సమాధానం ఇచ్చాడు. తన టైం మొత్తం గేమ్స్ ఆడటానికే కేటాయించానని వివరించాడు. 

ఆ బాలుడు దాదాపు 15 రోజులు బెంగళూరులో ఉన్నాడు. ప్రతి రోజు బెంగళూరు రైల్వే స్టేషన్‌లో పడుకున్నాడు. దాని చుట్టుపక్కలే ఆహారం తిన్నాడు. వెంట తెచ్చుకున్న నగదులో చాలా వరకు ఖర్చు పెట్టాడు. కానీ, నగలను మాత్రం అట్లాగే ఉంచుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu