కదులుతున్న కారు టాప్ పై పుష్ అప్‌లు తీసిన మందుబాబు.. వైరల్ వీడియో ఇదే

Published : May 31, 2023, 04:30 PM IST
కదులుతున్న కారు టాప్ పై పుష్ అప్‌లు తీసిన మందుబాబు.. వైరల్ వీడియో ఇదే

సారాంశం

గురుగ్రామ్‌లో ఓ కారు పైన లిక్కర్ తాగి పుష్ అప్‌లు తీశాడు. డ్యాన్స్ చేశాడు. కారు విండోల నుంచి ఫ్రెండ్స్ ఎంరేజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వారికి రూ. 6,500 చలానా వేశారు.  

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. అందులో ఓ వ్యక్తి ఫుల్‌గా లిక్కర్ తాగి.. కారు టాప్ ఎక్కేశాడు. ఆ టాప్‌పై కూర్చుని హంగామా చేయడమే కాదు.. పుష్ అప్‌లు కూడా తీశాడు. డోర్ విండోల నుంచి అతని ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తుండటం గమనార్హం. పుష్ అప్‌ల తర్వాత వారు డ్యాన్స్ కూడా చేసినట్టు కనిపించింది. ఇదంతా కారు రద్దీగా ఉండే గురుగ్రామ్ రోడ్డుపై నడుస్తూ ఉండగా జరిగింది. ఆ కారు వెనుకాలే వస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ఘటనను వీడియో తీశాడు. ట్విట్టర్‌లో పోస్టు చేసి ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

మారుతి సుజుకీ ఆల్టో కారులో మందు తాగుతూ.. వారు వెళ్లుతున్నారు. ఒక వ్యక్తి ఆ కారు టాప్ ఎక్కేశాడు. బాటిల్స్‌లో మందు తాగాడు. ఆ తర్వాత కారు పైనే పుష్ అప్‌లు కూడా తీశాడు. అతని ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని ఎంరేజ్ చేశారు. వారు కూడా విండోల నుంచి నడుము మేరకు బయటకు వంగి ఎంకరేజ్ చేస్తుండటం గమనార్హం. కారు కదులుతూ ఉండగానే డోర్‌ కూడా తీసే ప్రయత్నం చేశారు. చివరకు ఆ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నట్టూ కనిపించారు. 

Also Read: వేగంగా వీచిన గాలికి బస్సు పైకప్పే లేచిపోయింది.. తమిళనాడులో ఘటన.. ఫొటోలు వైరల్

గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. యాక్షన్ తీసుకున్నారు. వారికి ట్రాఫిక్ చలాన్ ఇష్యూ చేసినట్టు పేర్కొన్నారు. రూ. 6,500 జరిమానా వేసినట్టు ఓ ట్విట్టర్ హ్యాండిల్ తెలిపింది. రోడ్డుపై ఇలా చేసి వారితోపాటు ఇతరుల ప్రాణాలనూ ముప్పులో పడేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించరాదని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu