Uttar Pradesh News: దారుణం.. మామిడి పండు కావాల‌ని మేన‌కోడ‌లు మారాం.. పీక కోసి హ‌త్య చేసిన మేన‌మామ‌

Published : Jul 23, 2022, 05:44 PM ISTUpdated : Jul 23, 2022, 06:03 PM IST
 Uttar Pradesh News: దారుణం.. మామిడి పండు కావాల‌ని మేన‌కోడ‌లు మారాం.. పీక కోసి హ‌త్య చేసిన మేన‌మామ‌

సారాంశం

Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం చేస్తున్న‌ సమయంలో మామిడి పండు కావాలని పదే పదే అడిగినందుకు త‌న‌ 5 ఏళ్ల మేనకోడలును అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ మేన‌మామ‌.

Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం చేస్తున్న‌ సమయంలో మామిడి పండు కావాలని పదే పదే అడిగినందుకు త‌న‌ 5 ఏళ్ల మేనకోడలును అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ మేన‌మామ‌. తొలుత త‌న ఐదేళ్ల మేనకోడలు త‌ల‌పై రాడితో కొట్టాడు. అనంత‌రం పీక కోసి విచ‌క్ష‌ణ‌ర‌హితంగా హత్య చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా ఎవ‌రికి తెలియ‌కుండా.. ఆ చిన్నారి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి దాచిపెట్టాడు. పోలీసులు రంగంలో దిగ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.  ప్రస్తుతం నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. షామ్లీ జిల్లాలోని ఖేదా కుర్తాన్ గ్రామంలో ఓ ఐదేళ్ల చిన్నారి త‌న మేన‌మామ ఉమర్దీన్ ను భోజనం చేసే స‌మ‌యంలో మామిడిపండ్లు కావాలని పదేపదే కావాల‌ని మరాం చేయ‌డంతో ఆ వ్య‌క్తి కోపోద్రిక్తుడయ్యాడు. తీవ్ర ఆవేశానికి లోనై.. మొదట ఆ చిన్నారి తలపై రాడ్‌తో బ‌లంగా దాడి చేసాడు. దీంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. ఆ స‌మ‌యంలో.. ఆ నిందితుడు విచ‌క్ష‌ణ కోల్పోయాడు. ఆ స‌మ‌యంలో ఆ చిన్నారిని ర‌క్షించాల్సింది పోయి..  గొంతు కోసి అత్యంత దారుణంగా హ‌తమ‌ర్చాడు. అంతటితో ఆగ‌కుండా అమాయకురాలి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టారు. మీడియా కథనాల ప్రకారం..ఈ హత్య షామ్లీ జిల్లాలోని ఖేదా కుర్తాన్ గ్రామంలో మంగళవారం జ‌రిగింది. 

అనుమానం రావడంతో నిందితుడు పరారీ 

త‌న కూతురు క‌నిపించ‌డం లేద‌ని ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు వెతుకుతున్నారు. గ్రామ‌స్థులు కూడా వారికి స‌హయంగా నిలిచారు. ఈ స‌మ‌యంలో నిందితుడు కూడా ఆ చిన్నారిని వెత‌క‌డానికి వెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌పై గ్రామ‌స్థులు పోలీసుల‌కు స‌మాచారమివ్వ‌డంతో వారు వెంట‌నే రంగంలోకి దిగారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో నిందితుడు ఉమర్దీన్ ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితుడు గ్రామస్తులతో కలిసి బాలికను వెతకడానికి వెళ్లాడని, అయితే పోలీసులు అనుమానించడంతో అతను వెంటనే ప‌రార్ అయ్యార‌ని, కానీ వెంట‌నే నిందితుడిని ప‌ట్టుకున్న‌ట్టు  కండ్లాల ఎస్‌హెచ్‌ఓ శ్యామ్‌వీర్ సింగ్ తెలిపారు.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణలో ఉమర్దీన్ అనే నిందితుడి ఇంట్లో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడిని గురువారం రాత్రి అరెస్టు చేసి శుక్రవారం జైలుకు తరలించారు.  

షామ్లీ ASP OP సింగ్ మాట్లాడుతూ.. నిందితుడు బాలిక కోసం వెతకడానికి గ్రామస్థులతోపాటు వెళ్ళాడు. కానీ, పోలీసులకు అత‌నిపై అనుమానం రాగానే అక్క‌డి నుంచి వెంటనే పారిపోయాడు. కానీ, పోలీసుల‌కు దొరికిపోవడాని తెలిపారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి నిందితుడు ఉమర్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి హత్య ఆయుధాలు, కత్తి, ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు. అతన్ని జైలుకు పంపిన‌ట్టు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu