పెళ్లయిన 2 గంటలకే ట్రిపుల్ తలాక్.. నవవధువుని నిర్దాక్షిణ్యంగా మండపంలోనే విడిచిపెట్టిన వరుడు..

Published : Jul 14, 2023, 11:04 PM IST
పెళ్లయిన 2 గంటలకే ట్రిపుల్ తలాక్.. నవవధువుని నిర్దాక్షిణ్యంగా మండపంలోనే విడిచిపెట్టిన వరుడు..

సారాంశం

కట్నం దురాశతో ఓ వరుడి చేసిన పని వధువు కుటుంబంలో కలకలం రేగింది. కుటుంబసభ్యుల ముందు పరువు పోయింది. దీంతో వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కట్ చేస్తే.. ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరోసారి ట్రిపుల్ తలాక్ ఘటన తెరపైకి వచ్చింది. కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లయిన రెండు గంటలకే వరుడు వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలున్నాయి. అనంతరం వరుడు నిఖా మండపంలో వధువును వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అదే సమయంలో వధువు సోదరుడు తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వరకట్న అత్యాశపై కేసు పెట్టాడు.

పెళ్లి తర్వాత వరుడి వైఖరి మారింది

వివరాలిలా ఉన్నాయి. ఫతేహాబాద్ రోడ్డులోని ప్రియాంషు గార్డెన్‌లో బుధవారం నాడు ధోలిఖర్ మంటోలా కుమార్తెల (అమన్,ఆసిఫ్‌లతో) వివాహం జరిగినట్లు చెబుతున్నారు. పెద్ద కూతురు గౌరీ వివాహం అమన్ తో జరిగింది. కుటుంబ సభ్యులు ఆచారాల ప్రకారం ఆమెకు వీడ్కోలు పలికారు. అదే సమయంలో అదే మండపంలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు చిన్న కూతురు డాలీ వివాహం కూడా ఆసిఫ్‌తో జరిగింది. వివాహం తర్వాత.. ఆసిఫ్,అతని కుటుంబ సభ్యులు కట్నంగా కారును డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఒక్కసారిగా కారు డిమాండ్ చేయడంతో వధువు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.

ఎవరి మాట వినని వరుడు

పెళ్లికొడుకును ఒప్పించాలని వధువు కుటుంబీకులను ఎంతో ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. లక్షల్లో  కట్నకానుక విన్నవించినా వరుడు ఎవరి మాట వినలేదు. ఈ సమయంలో నవ వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పి వరుడు పెళ్లి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వరుడి ఈ చర్య తర్వాత వధువు కుటుంబంలో కలకలం రేగింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కేసు నమోదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?