కరోనా అనుమానం: దగ్గాడని ఫ్రెండ్‌ని తుపాకీతో కాల్చేశాడు

By Siva Kodati  |  First Published Apr 15, 2020, 7:31 PM IST
భారతదేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన నాటి నుంచి దేశంలో సామాజిక పరిస్ధితులు మరింత దిగజారుతున్నాయి. పక్క వ్యక్తి తుమ్మినా, దగ్గినా సరే అనుమానం కలుగుతుంది. 

భారతదేశంలో కరోనా వైరస్ ప్రవేశించిన నాటి నుంచి దేశంలో సామాజిక పరిస్ధితులు మరింత దిగజారుతున్నాయి. పక్క వ్యక్తి తుమ్మినా, దగ్గినా సరే అనుమానం కలుగుతుంది. ఇది పక్కనబెడితే ఇలాంటి అనుమానాల కారణంగా కొందరు భౌతిక దాడులకు, అనుమానాలకు గురవుతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణ సంఘటన జరిగింది. దగ్గుతున్నాడని కాల్చిపారేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ సింగ్ అలియాస్ ప్రవేశ్, జై వీర్‌సింగ్ అలియాస్ గుల్లూ దయానగర్‌లో వ్యవసాయం చేస్తారు.

ఈ క్రమంలో లాక్‌డౌన్‌ కారణంగా బోర్ కొట్టడంతో మంగళవారం రాత్రి మరో ముగ్గురితో కలిసి లూడో ఆడుతున్నారు. అప్పుడే గుల్లూ అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ప్రవేశ్ దగ్గడంతో ప్రశాంత్ అతడితో వాగ్వాదానికి దిగాడు.

ఇద్దరి మధ్యా గొడవ తారాస్థాయికి చేరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గుల్లూ వెంటనే తుపాకీ తీసి అతనిని కాల్చేశాడు. ఈ ఘటనతో తీవ్ర గాయాల పాలైన ప్రవేశ్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి పరిస్ధితి నిలకడగానే ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
click me!