అన్న మాట ప్రకారం: వారంలో రూ.4,250 కోట్ల ఐటీ రీఫండ్స్‌ విడుదల

By Siva KodatiFirst Published Apr 15, 2020, 6:52 PM IST
Highlights
ఐటీ రిఫండ్స్‌ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లోనే 10.2 లక్షల మందికి రూ.4,250 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) తెలిపింది.
దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రోజువారీ కూలీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు ఆదాయం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఐటీ రిఫండ్స్‌ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.

వారం రోజుల్లోనే 10.2 లక్షల మందికి రూ.4,250 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) తెలిపింది. కోవిడ్ 19 కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే వేగంగా ఈ ప్రక్రియ చేపట్టామని సీబీడీటీ పేర్కొంది.

రూ.5 లక్షల లోపు రీఫండ్ల వేగంగా చేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా దేశంలో దాదాపు 14 లక్షల మంది ప్రయోజనం పొందుతారు. మిగిలిన 1.75 లక్షల మందికి ఈ వారంలో చెల్లింపు చేస్తామని సీబీడీటీ ప్రకటించింది.

ట్యాక్స్ పేయర్ల బ్యాంకు ఖాతాల్లో ఈ రీఫండ్ వారం రోజుల్లోగా జమ అవుతుంది. మరో 1.74 లక్షల మందికి రీఫండ్‌ గురించి ఈ మెయిల్ పంపించాం. వారు స్పందించగానే ఈ ఏడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని... నగదు బదిలీ చేసేముందు చెల్లించాల్సిన  మొత్తం, బ్యాంక్ ఖాతాలను ధ్రువీకరించాలని సీబీడీటీ పన్ను చెల్లింపుదారులను కోరింది. 
click me!