కట్నం కోసం గొడవ.. భార్య నాలుక కోసేసిన భర్త

Published : Nov 20, 2018, 11:39 AM IST
కట్నం కోసం గొడవ.. భార్య నాలుక కోసేసిన భర్త

సారాంశం

కట్నం విషయంలో ఏర్పడిన వివాదంలో.. ఓ భర్త తన కట్టుకున్న భార్య నాలుక కోసేశాడు. 

కట్నం విషయంలో ఏర్పడిన వివాదంలో.. ఓ భర్త తన కట్టుకున్న భార్య నాలుక కోసేశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 6వ తేదీన ఆమె నాలుకను భర్త కోసేశాడు. కాగా.. అనంతరం ఆమెకు సమీపంలోని ఓ చిన్న ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా.. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియజేస్తుందనే భయంతో.. దాదాపు పది రోజుల పాటు ఆమెను ఇంట్లోని ఓ గదిలో బంధించారు.

ఆ గదిలో నుంచి తప్పించుకున్న మహిళ.. తన తండ్రి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. బాధిత మహిళ వివాహం చేసుకున్నది ఓ కానిస్టేబుల్ కొడుకుని కావడం గమనార్హం. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే