మహారాష్ట్ర ఆర్మీ డిపోలో పేలుడు: 6గురు మృతి

Published : Nov 20, 2018, 10:28 AM ISTUpdated : Nov 20, 2018, 10:33 AM IST
మహారాష్ట్ర ఆర్మీ డిపోలో పేలుడు: 6గురు మృతి

సారాంశం

మహారాష్ట్రలోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా పదిమంది గాయపడ్డారు. వార్థాలోని పుల్గావ్ ఆర్మీ డిపోలో మంగళవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది.

వార్ధా: మహారాష్ట్రలోని ఆర్మీ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా పది మంది గాయపడ్డారు. వార్థాలోని పుల్గావ్ ఆర్మీ డిపోలో మంగళవారం ఉదయం ఈ పేలుడు సంభవించింది.

డిపోలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల్లో ఆయుధ కర్మాగారం ఉద్యోగులతో పాటు ఇద్దరు కార్మికులున్నారు. 

పేలుడు సంభవించినప్పుడు పెద్ద యెత్తున శబ్దం వినిపించింది. చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆ శబ్దం వినిపడినట్లు చెబుతున్నారు. 

మహరాష్ట్రలోని వార్ధా జిల్లాలోని ఆర్డినెన్స్ డిపో సమీపంలో పేలుడు సంభవించి ముగ్గురు మరణించారని, పాత పేలుడు పదార్థాలను ధ్వంసం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. 

పుల్గావ్ లోని ఇదే డిపోలో 2016లో సంభవించిన పేలుడులో 16 మంది మృత్యువాత పడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100 వేలు..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే