పట్టు రైతులకు బంపరాఫర్ ... 50 వేల రూపాయలు అందించనున్న యోగి సర్కార్

By Arun Kumar PFirst Published Oct 5, 2024, 9:52 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్‌ను పట్టు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపడానికి యోగి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో పట్టు పరిశ్రమలో రాణిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. 

లక్నో : ఉత్తర ప్రదేశ్ ను పట్టు ఉత్పత్తిలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యోగి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టు ఉత్పత్తితో పాటు ఈ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ప్రత్యేక అవార్డులతో సన్మానించేందుకు సిద్దమయ్యింది.  2024-25 సంవత్సరానికి గాను పట్టు విభాగంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రేష్మ్ రత్న సమ్మాన్‌ అవార్డులతో సన్మానించనుంది. పట్టు పరిశ్రమలో నూతన ఆవిష్కరణలు, ఉత్పత్తి,డిజైనింగ్‌లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 8 విభిన్న విభాగాల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు.

పట్టు రంగంలో నైపుణ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో ఈ అవార్డులను అందిస్తున్నారు. పట్టు తయారీ, ఉత్పత్తుల్లో నూతన ఆవిష్కరణలు, అత్యధిక దారం అమ్మకాలు, అత్యధిక పట్టు ఉత్పత్తి అమ్మకాలు, పట్టుతో తయారు చేసిన దుస్తులు, ఇతర ఉత్పత్తులలో అత్యుత్తమ డిజైనింగ్ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు.

Latest Videos

ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచాన్ మాట్లాడుతూ... పట్టు పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పట్టు పరిశ్రమలో నిరంతరం మెరుగుదలలు,  నూతన ఆవిష్కరణలు తీసుకువస్తున్న రాష్ట్రంలోని చేతివృత్తులవారు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ఉద్దేశ్యమని అన్నారు.

ప్రథమ బహుమతిగా 50 వేల రూపాయలు

ప్రతి విభాగంలో ప్రథమ బహుమతిగా 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 25,000 రూపాయలు బహుమతిని అందజేస్తారు. విజేతలకు ప్రశంసాపత్రం, స్మారక చిహ్నాన్ని కూడా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమకు సంబంధించిన "రేష్మ్ మిత్ర" పత్రికను కూడా ఆవిష్కరిస్తారు. దీనితో పాటు పట్టు ఉత్పత్తి, వాణిజ్యంలో నిమగ్నమైన వ్యక్తులకు ఉపయోగపడే రేష్మ్ మిత్ర పోర్టల్‌ను కూడా ప్రారంభిస్తారు.

అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఈ అవార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది... చివరి తేదీ అక్టోబర్ 10, 2024గా నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను రేష్మ్ డైరెక్టరేట్, విశ్వాస్ ఖండ్-3, గోమతి నగర్, లక్నోకు పంపవచ్చు. దరఖాస్తు ఫారాలు విభాగం వెబ్‌సైట్ www.sericulture.up.gov.in లేదా రేష్మ్ మిత్ర పోర్టల్ http://reshammitraup.in/లో అందుబాటులో ఉన్నాయి.

click me!