కాబోయే భర్తతో కలిసి పార్క్‌‌కు వెళ్లిన మహిళ.. లైంగికంగా వేధించిన పోలీసులు..

Published : Oct 01, 2023, 05:24 PM IST
కాబోయే భర్తతో కలిసి పార్క్‌‌కు వెళ్లిన మహిళ.. లైంగికంగా వేధించిన పోలీసులు..

సారాంశం

నిశ్చితార్థం చేసుకున్న ఓ జంట సరదాగా గడిపేందుకు పార్క్‌కు వెళ్లగా అక్కడ వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పార్క్‌లో ఆ జంటను ఇద్దరు పోలీసులు వేధించారు. అంతేకాకుండా తమతో శృంగారంలో పాల్గొనాలని మహిళపై ఒత్తిడి కూడా చేశారు.

నిశ్చితార్థం చేసుకున్న ఓ జంట సరదాగా గడిపేందుకు పార్క్‌కు వెళ్లగా అక్కడ వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పార్క్‌లో ఆ జంటను ఇద్దరు పోలీసులు వేధించారు. అంతేకాకుండా తమతో శృంగారంలో పాల్గొనాలని మహిళపై ఒత్తిడి కూడా చేశారు. అంతేకాకుండా డబ్బులు కూడా డిమాండ్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ ఘటన చోటుచేసుకోగా తాజాగా బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నీచ ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. 

స్థానిక నివేదికల ప్రకారం.. గౌతమ్ బుద్ధ నగర్‌లోని బిస్రాఖ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న బాధిత మహిళ సెప్టెంబర్ 16న తన కాబోయే భర్తను సాయి ఉప్వాన్ పార్క్‌లో కలుసుకుంది. అయితే వారు ఉన్నచోటుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు పోలీసు యూనిఫామ్‌లో(ఒక కానిస్టేబుల్‌, ఒక హోంగార్డు) ఉన్నారు. ఒకరు సాధారణ దుస్తుల్లో ఉన్నాడు. అయితే అక్కడికి చేరుకోగానే వారు ఆ జంటను వేధించడం, బెదిరించడం మొదలుపెట్టారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. తమతో లైంగిక సంబంధం పెట్టుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. 

అయితే తమను విడిచిపెట్టమని మహిళకు కాబోయే  భర్త వారిని వేడుకున్నాడు. అయితే వారు వెనక్కి తగ్గకుండా.. మహిళపై వేధింపులను కొనసాగించారు. డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. చివరకు ఆ జంట పేటీఎమ్‌లో పోలీసులకు రూ. 1,000 చెల్లించాక.. దాదాపు మూడు గంటల తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత  కానిస్టేబుల్‌, హోంగార్డులు ప్టెంబర్‌ 22న బాధితురాలి ఇంటికి చేరుకుని డబ్బులు తిరిగి ఇవ్వడంతోపాటు ఫిర్యాదు చేయవద్దని బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే బాధిత మహిళ ధైర్యం తెచ్చుకుని నిందితులపై అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

బాధిత మహిళ సెప్టెంబర్ 28న ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు తన ప్రైవేట్ పార్ట్‌ను కూడా తాకారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు ప్రారంభించగా.. ఆ ఆరోపణలు సరైనవేనని ధ్రువీకరించబడ్డాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ కేసులో ప్రమేయం ఉన్న కానిస్టేబుల్‌, హోంగార్డులపై చర్యలకు ఉపక్రమించారు. పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డులతో పాటు గుర్తు తెలియని వ్యక్తిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

‘‘కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. హోంగార్డుపై క్రమశిక్షణా చర్య కోసం డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయబడింది. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న మూడో వ్యక్తి గురించి కూడా సమాచారం పొందబడింది. పోలీసులు ఆ విషయంలో ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు’’ అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్) నిమిష్ పాటిల్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu