Uttar Pradesh: ద‌ళిత విద్యార్థిపై ఉపాధ్యాయుడి క‌ర్కశం.. బాత్​రూమ్​లో పెట్టి తాళం.. 18 గంటల పాటు అలానే..

By Rajesh KFirst Published Aug 16, 2022, 6:45 AM IST
Highlights

Uttar Pradesh: ఓ విద్యార్థి ప‌ట్ల ఉపాద్యాయుడు దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు.  11 ఏళ్ల విద్యార్థిని  ఓ ఉపాధ్యాయుడు బాత్​రూమ్​లో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో ఆ పిల్ల‌వాడు సుమారు 18 గంటలపాటు టాయిలెట్​లోనే ఉండిపోయాడు. తరువాత రోజు ఉదయం వేరే ఉపాధ్యాయులు బాత్​రూమ్​ డోర్​ను తెరవగా బయటకొచ్చాడు బాలుడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Uttar Pradesh:  కొంద‌రూ టీచ‌ర్లు ఉపాధ్యాయ వృత్తికి క‌ళంక‌లం తీసుక‌వ‌స్తున్నారు. ఇటీవ‌ల రాజస్థాన్‌లో ఓ దళిత విద్యార్థి త‌న కుండలో నీళ్లు తాగాడనే కోపంతో ఉపాధ్యాయుడు చితకబాదాడు. దాంతో ఆ పిల్లవాడు తీవ్రంగా గాయప‌డ్డాడు. కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు గ‌త ఆదివారం మరణించాడు. దాంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న మ‌రిచిపోక ముందే.. మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 

అది కూడా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో..  ఓ విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్టాడు. పసివాడనే క‌నిక‌రం లేకుండా వేధింపుల‌కు గురిచేశాడు. చివ‌రికి స్కూల్ టాయిలెట్‌లో పెట్టి తాళం వేసేశాడు. అత్యంత‌ పాశ‌వికమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భిదూనా ప్రాంతంలో వెలుగులోకి వ‌చ్చింది. 

వివ‌రాల్లోకెళ్తే.. భిదూనా ప్రాంతంలోని ఓ ప్ర‌భుత్వ‌ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న ప‌ద‌కొండేండ్ల  విద్యార్థి పట్ల.. అదే పాఠ‌శాల‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. ఆ పిల్ల‌వాడు చెప్పే విన‌లేద‌నే కోపంతో పాఠ‌శాల‌ ముగిసే సమయంలో టాయిలెట్​లో బంధించి తాళం వేసేశాడు. 

అయితే.. ఆ విష‌యం తెలియని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. బాత్రూమ్‌లో బంధిగా ఉన్న పిల్లవాడు సాయం చేయ‌మ‌ని ఎంత‌గానో అరిచాడు. ఆ పాఠ‌శాల ఊరికి దూరంలో ఉండ‌టంతో ఆ పిల్ల‌వాడి అరుపులు, ఆర్త‌నాదాలు ఎవ‌రికి వినిపించ‌లేదు. ఎవరూ స‌హయం చేయ‌డానికి రాలేదు. అలా.. ఆ రాత్రంతా మరుగుదొడ్డిలోనే ఉండిపోయాడు. దాదాపు 18 గంటలపాటు ఆ పిల్ల‌వాడు బాత్రూమ్‌లోనే న‌ర‌క‌యాత‌న అనుభ‌వించాడు. తిన‌డానికి తిండి లేక‌.. తాగ‌డానికి నీరు లేక అల‌మాటించాడు. అయితే పిల్లవాడు ఇంటికి రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఊరంతా వెదికారు. కానీ ప్రయోజనం లేకపోయింది.

తర్వాత రోజు ఉద‌యం పాఠశాల తెరవగానే.. తల్లిదండ్రులు, త‌న స్నేహితులు పాఠ‌శాల మొత్తం వెతికారు. కానీ స్కూల్లో ఎక్కడా కనిపించలేదు. చివరకు బాత్రూమ్ తాళం ప‌గ‌ల‌గొట్టి చూడగా..ఆ చిన్నారి అందులో ఏడుస్తూ కనిపించాడు. వెంటనే బాలుడు బయటకొచ్చి.. టీచర్ చేసిన పని గురించి తెలియజేశారు. దాంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆగస్ట్ 5వ తేదీన జరిగినా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 
 

click me!