యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా: క్వారంటైన్ లోకి సీఎం

By narsimha lodeFirst Published Apr 14, 2021, 1:13 PM IST
Highlights

ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లాడు.

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లాడు.సీఎంఓలో పనిచేసే కొందరు అధికారులకు కరోనా సోకింది.ఈ విషయం తేలడంతో యోగి ఆదిత్యనాథ్  క్వారంటైన్ లోకి వెళ్తున్నట్టుగా ఆయన మంగళవారం నాడు ప్రకటించారు.

ఇవాళ పరీక్షలు చేయించుకొంటే  కరోనా సోకిందని తేలింది. ఈ విషయాన్ని యోగి  ఆదిత్యనాథ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. క్వారంటైన్ లోకి వెళ్లినట్టుగా ఆయన తెలిపారు.తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని సీఎం యోగి కోరారు. తన కార్యాలయంలో అధికారులు కరోనా బారినపడడంతో  యోగి జాగ్రత్తలు తీసుకొన్నారు. అయితే లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయించుకోవడంతో తనకు కూడ కరోనా సోకిందని యోగి ట్విట్టర్ లో తెలిపారు.

&nb

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లాడు.
సీఎంఓలో పనిచేసే కొందరు అధికారులకు కరోనా సోకింది.ఈ విషయం తేలడంతో యోగి ఆదిత్యనాథ్ క్వారంటైన్ లోకి వెళ్తున్నట్టుగా ఆయన మంగళవారం నాడు ప్రకటించారు. pic.twitter.com/UKeOiSpaoD

— Asianetnews Telugu (@AsianetNewsTL)

sp;

 

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా సేకండ్ వేవ్ వి.జృంభిస్తోంది. గత 24 గంటల్లో సుమారు వెయ్యి మందికి పైగా కరోనాతో మరణించారు. ఒక్క రోజునే లక్షన్నరకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.దేశంలో కరోనాను నిరోధించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరంత వేగవంతం చేయాలని ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాలను ఆదేశించిన విషయం తెలిసిందే. 

click me!