అఖిలేష్ యాదవ్ కు కరోనా పాజిటివ్ !

By AN TeluguFirst Published Apr 14, 2021, 12:37 PM IST
Highlights

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. 

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. 

ఈ మేరకు బుధవారం ట్విట్టర్ లో అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. అంతేకాదు తాను ఇప్పుడు హోం ఐసోలేషన్ లో ఉన్నానని, నిన్నటివరకు తనతో సన్నిహితంగా ఉన్నవారంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

‘నేను చేయించుకున్న కోవిడ్ టెస్ట్ ఇవ్వాళ పాజిటివ్ అని తేలింది. దీంతో నేను ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. చికిత్స తీసుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా నాతో కాంటాక్ట్ లో ఉన్నవారంతా టెస్టులు చేయించుకోండి. కొద్దికాలం వాళ్లు కూడా ఐసోలేషన్ లో ఉండడం మంచిది’ అంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. 

మంగళవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా ఐసోలేషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. యోగి ఆదిత్యానాథ్ కలిసిన కొంతమంది అధికారలకు కోవిడ్ 19 పాజిటివ్ రావడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశారు. నవరాత్రి, రంజాన్ పండుగల నేపథ్యంలో మహమ్మారి ప్రబలకుండా ఇప్పటికే ఐదుగురికంటే ఎక్కువమంది గూమిగూడడం మీద నిషేధం విధించారు. 

click me!