ఆహారం గొంతులో ఇరుక్కుని... నిద్రలోనే బిజెపి ఎమ్మెల్యే కూతురు మృతి

Published : Aug 28, 2022, 09:05 AM IST
ఆహారం గొంతులో ఇరుక్కుని... నిద్రలోనే బిజెపి ఎమ్మెల్యే కూతురు మృతి

సారాంశం

రాత్రితిన్నది గాడనిద్రలో వుండగా గొంతుకు అడ్డుపడి ఊపిరాడక ఉత్తర ప్రదేశ్ కు చెందిన బిజెపి ఎమ్మెల్యే కూతురు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మధ్య ప్రదేశ్ భోపాల్ లో చోటుచేసుకుంది.     

భోపాల్ : ఉత్తర ప్రదేశ్ కు చెందిన అధికార బిజెపి ఎమ్మెల్యే కూతురు అనుమానాస్పద రీతిలో మధ్య ప్రదేశ్ లో మృతిచెందింది. రాత్రి భోంచేసి పడుకున్న భార్య ఉదయం లేచిచూసేసరికి మృతిచెందివుందని ఎమ్మెల్యే అల్లుడు చెబుతున్నాడు. రాత్రి తిన్న ఆహారం గొంతులో ఇరుక్కుని నిద్రలోనే మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినట్లు డాక్టర్లు నిర్దారించారు. అయితే ఎమ్మెల్యే కూతురు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్ నియోజకవర్గంలో అధికార బిజెపికి చెందిన రాజేంద్ర మౌర్య ఎమ్మెల్యేగా వున్నారు. అతడి కూతురు పూనమ్ మౌర్యకి సంజయ్ మౌర్య అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ తో ఐదేళ్ళక్రితం వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నివాసముంటున్నారు.   

అయితే భోపాల్ లోని అయోధ్యనగర్ నివాసంలో బుధవారం రాత్రి పూనమ్-సంజయ్ దంపతులు భోంచేసి పడుకున్నారు. గాడనిద్రలో వుండగా పూనమ్ గురక పెట్టడంతో ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి ఊపిరాడక మరణించింది. ఉదయం భర్త సంజయ్ లేచి భార్యను లేపడానికి ప్రయత్నించాడు. అయితే ఎంతకూ ఆమె లేవకపోవడంతో కంగారుపడిన అతడు హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. 

read more  సత్యసాయి జిల్లాలో అమానుషం... మనవరాలి వయసు బాలికను పెళ్ళాడిన అరవయేళ్ల తాంత్రికుడు

పూనమ్ మౌర్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె మృతికి కారణం భయటపడింది. గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం వల్లే ఆమె మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెలుగుచూసింది. పూనమ్ మృతిపై అనుమానాలుండటంతో పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసారు. పూనమ్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్