డ్రాగ‌న్ కుటిల బుద్ధి.... అరుణాచల్‌లో చైనా భారీ నిర్మాణాలు 

By Rajesh KFirst Published Aug 28, 2022, 3:41 AM IST
Highlights

అరుణాచల్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్‌ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది

డ్రాగ‌న్ దేశం చైనా కుటిల నీతి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. భారత సరిహద్దుల్లో నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ.. చొరబాట్లకు పాల్పడుతోంది. తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు వద్ద  పక్కా నిర్మాణాలను చేపడుతోంది. దీనికి  సంబంధించిన‌ కొన్ని ఫొటోలను స్థానికులు సాక్ష్యాధారాలుగా సేకరించారు. 

అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లా వాసులు చగ్లగామ్‌లోని హడిగరా-డెల్టా 6 సమీపంలో చైనా సైన్యం చేస్తున్న నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని ఫొటోలు తీశారు. చైనా PLA (పీపుల్స్ రిపబ్లిక్ ఆర్మీ) సిబ్బంది, భారీ యంత్రాలతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వీడియోలను రికార్డ్ చేశారు. చాగ్లాం భారతదేశం-చైనా సరిహద్దు (వాస్తవ నియంత్రణ రేఖ) LAC సమీపంలో భారతదేశం యొక్క చివరి అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన ఈ వీడియో ఆగస్టు 11న రికార్డ్ చేయబడింది. బీజింగ్ చేసిన ఈ ఆరోపణపై తీవ్ర ఆందోళన వ్యక్తమ‌వుతున్నాయి. 
చేశారు.
 
స్థానికులు ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. బీజింగ్ చొరబాటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో-చైనా సరిహద్దులో ఉన్న షి యోమి జిల్లాకు చెందిన మెచుఖా అనే గ్రామానికి చెందిన నివాసి చైనా LAC సమీపంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

భారత సైన్యం ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దు దగ్గరకు ఎవరినీ అనుమతించడం లేదని స్థానిక నివాసి చెప్పారు. అయితే, భారత్ వైపు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు బలహీనంగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు. సియాంగ్ జిల్లాలోని అలో పట్టణానికి మెంచుకాను కలిపే రహదారి ఉండేది, కానీ ఇది కూడా దశాబ్ద కాలం నాటి విషయం.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ చాలా నెమ్మదిగా పని చేస్తుందని, చైనా సరిహద్దుకు చేరుకోవడానికి 4 లేన్ల రహదారిని సిద్ధం చేసిందని స్థానికులు చెబుతున్నారు. మెంచుక పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండరని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు. మెంచుకాలో చిన్ని చిన్న సౌకర్యాలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మెరుగైన నెట్‌వర్క్ అవసరం ఉందని, ఇంటర్నెట్ సేవలు కల్పించాలని కోరుతున్నారు.

click me!