Uttar Pradesh Assembly Election Result 2022: యూపీలో 1989 నుండి అధికారానికి కాంగ్రెస్ దూరం, పొత్తులు కారణమేనా?

Published : Mar 10, 2022, 12:34 PM IST
Uttar Pradesh  Assembly Election Result 2022: యూపీలో 1989 నుండి అధికారానికి కాంగ్రెస్ దూరం, పొత్తులు కారణమేనా?

సారాంశం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 1989 నుండి కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఇతర పార్టీలతో పొత్తులు కూడా ఆ పార్టీ రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయేలా చేశాయి. ప్రియాంక గాంధీ ప్రచారం చేసినా కూడా యూపీలో కాంగ్రెస్ కు కలిసి రాలేదు.  

లక్నో: Uttar Pradesh రాష్ట్రంలో 1989 నుండి Congress పార్టీ అధికారానికి దూరంగా ఉంది. 1985లో చివరి సారిగా ఆ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత దేశంలో, రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ తన ఉనికిని కాపాడుకొనే పరిస్థితి నెలకొంది. 2019 జనవరి మాసంలో Priyanka Gandhiని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. యూపీ బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించారు. కానీ ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించినా కూడా ప్రభావం కన్పించలేదు. గత ఎన్నికల్లో కంటే ఈ దఫా ఆ పార్టీకి ఆశించిన సీట్లు దక్కేలా లేవు.

1985లో కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా అధికారాన్ని చేపట్టింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 94 అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుచుకొంది. ఆ సమయంలో అప్పట్లో Janata Dal లో ఉన్న Mulayam Singh Yadav ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. దేశంలో కాంగ్రెసేతర  ప్రభుత్వం కూడా ఏర్పాటైంది.

1991 లో ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 46 సీట్లలోనే విజయం సాధించింది. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేయడంతో అప్పుడు యూపీలో ఉన్న కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.  ఆ తర్వాత 1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 సీట్లకు మాత్రమే పరిమితమైంది.1993లో ఎస్పీ, బీఎస్పీ సంకీర్ణానికి కాంగ్రెస్ మద్దతును ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పీవీ నరసింహారావు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

1996 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ BSP తో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 33 సీట్లను గెలుచుకొంది. అయితే ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఎస్పీ, BJP తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఈ సమయంలో  సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నారు.

ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడంతో తమ పార్టీ ఓటింగ్ క్రమంగా తగ్గుతూ వచ్చిందని  కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.1996 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 125 స్థానాల్లోనే పోటీ చేసింది. మిగిలిన 300 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కోల్పోతూ వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

2002లో కాంగ్రెస్ పార్టీ 25 సీట్లకే పరిమితమైంది., 2003లో బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ సమయంలో ములాయం సింగ్ నేతృత్వంలో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ తోడ్పాటును ఇచ్చింది.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ ఉన్నారు.

2007 లో 22 స్థానాలకు కాంగ్రెస్ పడిపోయింది., 2012లో కాంగ్రెస్ 28 సీట్లను గెలుచుకొంది.2017 లో కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సీట్లకే పరిమితమైంది.2019 లో కాంగ్రెస్ పార్టీ తన కంచుకోట లాంటి ఆమేథీ స్థానాన్ని కూడా కోల్పోయింది. రాయ్‌బరేలీ స్థానంలోనే కాంగ్రెస్ విజయం సాధించింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభమయింది. గ‌తంలో కంటే ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగాయి. అధికార పార్టీ బీజేపీ.. ప్ర‌తిప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ప్ర‌చారం సాగిస్తూ.. గెలుపు త‌మ‌దేనంటూ ధీమా వ్య‌క్తం చేశాయి. ఇక కాంగ్రెస్‌, బీఎస్పీలు సైతం గ‌త వైభ‌వం కోసం గ‌ట్టిగానే పోరాటం సాగించాయి. ఆయా పార్టీలు భ‌విత‌వ్యం మార్చి 10 తేల‌నుంది.


యూపీ ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చి 14తో ముగుస్తుంది.  ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరిగాయి.  బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు సాగింద‌ని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం త‌మ‌దైన త‌ర‌హాలో ప్ర‌చారం సాగిస్తూ.. ఎన్నిక‌ల బ‌రిలో ముందుకుసాగాయి.  మొద‌టి విడుతలో 58 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌గా.. ఈ సారి 60.17 శాతం పోలింగ్ న‌మోదైంది. 2017 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ( 63.5 శాతం) త‌క్కువ‌గా ఉంది.

ఇక యూపీ రెండో విడత ఎన్నికల్లో తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 50
శాతం కంటే అధిక ముస్లిం ఓట‌ర్లు ఈ ప్రాంతంలో ఉండ‌టంతో అన్ని పార్టీలు ఓట‌ర్ల‌కు గాలంవేసేలా ముందుకు సాగాయి. 61.20 శాతం ఓటింగ్ న‌మోదైంది. మూడో ద‌శ‌లో 16 జిల్లాల్లోని 59 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. 623 మంది బ‌రిలో నిలిచారు.  కీల‌క‌మైన 16 జిల్లాల్లో ఐదు జిల్లాలు పశ్చిమ యూపీ, 6 అవధ్ ప్రాంతం, 5 బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ద‌శలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ , కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్‌, శివ‌పాల్ యాద‌వ్ వంటి నేత‌లు పోటి ప‌డ్డారు. అలాగే,  పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాల‌కు నాల్గో ద‌శ‌లో పోలింగ్ జ‌రిగింది.

ఇక ఫిబ్ర‌వ‌రి 27న ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగింది. మొత్తం 692 మంది బ‌రిలోకి దిగ‌గా.. వారిలో  యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , రాంపూర్ ఖాస్ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా , కుంట సీటు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా , యూపీ కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నవారిలో ప్రముఖులు, కేంద్ర మంత్రి అనుప్రియా ప‌టేల్ త‌ల్లి, అప్నాద‌ళ్ నేత కృష్ణా ప‌టేల్ అప్నాదళ్ కే త‌ర‌పున పోటీలో ఉన్నారు. 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో 6వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. ఇక  సోమ‌వారం నాడు (మార్చి 7) ఏడోద‌శ (చివ‌రిద‌శ‌) ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. మొత్తం 9 జిల్లాల్లోని 54 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. 613 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు.

ఇక ప్ర‌స్తుత యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి  యోగి ఆదిత్యానాథ్ గోర‌ఖ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగారు. స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత (ఎస్పీ), మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కర్కల్ నియోజవర్గం నుంచి బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ కేవలం 47 సీట్లు, కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ 19 స్థానాల్లో విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, స‌మాజ్ వాదీ పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ప్ర‌ధాన పోటీ ఈ రెండు పార్టీల మ‌ధ్య ఉంటుంద‌ని ఇప్ప‌టికే ముందుస్తు అంచనాలు సైతం పేర్కొన్నాయి.


 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu