రోడ్డు పక్కన దాబాలోకి దూసుకొచ్చిన‌ కారు.. ఒకరు మృతి, న‌లుగురికి గాయాలు

Published : Mar 07, 2023, 04:14 PM IST
రోడ్డు పక్కన దాబాలోకి దూసుకొచ్చిన‌ కారు.. ఒకరు మృతి, న‌లుగురికి గాయాలు

సారాంశం

Saharanpur: రోడ్డు పక్కన ఉన్న దాబాలోకి అతివేగంతో కారు దూసుకొచ్చింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. రాంపూర్ మణిహారన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్నదాబాలోకి దూసుకురావ‌డంతో 'ధాబా' యజమాని మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడినట్లు పేర్కొన్నారు.

Car Crashes Into Roadside Dhaba: అతివేగం ఒక‌రి ప్రాణాలు తీయ‌గా, మ‌రో న‌లుగురిని తీవ్రంగా గాయ‌ప‌ర్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రోడ్డు పక్కన ఉన్న దాబాలోకి కారు దూసుకొచ్చింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. రాంపూర్ మణిహారన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్నదాబాలోకి దూసుకురావ‌డంతో 'ధాబా' యజమాని మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. 

వివ‌రాల్లోకెళ్తే.. రాంపూర్ మణిహరన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఉన్న చిన్న దాబాలోకి దూసుకొచ్చింది. ఆ స‌మ‌యంలో అక్క‌డున్న‌వారిని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో దాబా  యజమాని మృతి చెందాడు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వస్తున్న కారు పాత్రలు శుభ్రం చేస్తున్న రెస్టారెంట్ యజమానిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ (గ్రామీణ) సాగర్ జైన్ తెలిపారు.

మృతుడిని రాజేష్ అలియాస్ పప్పు (52)గా గుర్తించామనీ, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. దాబాలోకి దూసుకెళ్లిన తర్వాత కారు బోల్తా పడిందని జైన్ తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు సహా నలుగురికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు ప్రయాణికులను వాహనం నుంచి బయటకు తీశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్ర‌మాదానికి అతివేగ‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

హిమాచ‌ల్  ప్ర‌దేశ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా ధరంపూర్ వద్ద అదుపు తప్పిన ఇన్నోవా కారు ఢీకొనడంతో ఐదుగురు వలస కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చండీగఢ్ పీజీఐకి తరలించారు. వేగంగా వచ్చిన కారు పనులు చేస్తున్న 9 మంది కూలీలపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిమ్లా-చండీగఢ్ హైవేపై ధరంపూర్ సమీపంలో ఉదయం 9.20 గంటలకు ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. 

తేని రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి 

త‌మిళ‌నాడులోని తేనిలో కారు టైర్ పగిలి లారీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు కేరళ వాసులు ప్రాణాలు కోల్పోయారు. కొట్టాయం పట్టణ శివారులోని తిరువతుక్కల్ ప్రాంతానికి చెందిన అజేష్, గోకుల్ గా గుర్తించారు. కొట్టాయం పట్టణానికి సమీపంలోని వడవత్తూర్ కు చెందిన అనతు అనే వ్యక్తి ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని తేని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?