కాన్పూర్ లో ఘోరం: బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

Published : Jun 09, 2021, 06:57 AM IST
కాన్పూర్ లో ఘోరం: బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

సారాంశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రధాని ఈ సంఘటనపై స్పందించారు.

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో మంగళవారం రాత్రి ఘోరమైన రోడ్డు ప్రమాజం జరిగింది. కాన్పూర్ సమీపంలో గల సచెంది వద్ద ఓ మినీ బస్సు జెసీబీని ఢీకొని, ఆ తర్వాత బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించినట్లు కాన్పూర్ ఐజి మోహిత్ అగర్వాల్ చెప్పారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించారు. బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు సీఎం సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయలేసి, క్షతగాత్రులకు రూ.50 వేల రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించారు. 

 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌