జమ్మూకాశ్మీర్ : వైష్ణోదేవి ఆలయంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Siva Kodati |  
Published : Jun 08, 2021, 08:54 PM IST
జమ్మూకాశ్మీర్ : వైష్ణోదేవి ఆలయంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

సారాంశం

జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది

జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో పాటు పొగలు చుట్టుపక్కల కమ్ముకున్నాయి. అయితే, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 45 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి  ప్రాణనష్టం సంభవించలేదు. మంటలు అదుపులోనికి తెచ్చామని ఆలయ సీఈవో ప్రకటించారు.

గర్భగుడికి సమీపంలో ఉన్న కాంప్లెక్‌లోని క్యాష్ కౌంటర్‌ వద్ద మంటలు చెలరేగడంలో క్యాష్ కౌంటర్ పూర్తిగా  దగ్ధమైనట్టు తెలుస్తోంది. కొంత నగదు, రికార్డులు కాలిపోయినట్లు అధికారిక వర్గాల సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగా మధ్యాహ్నం 4.15 గంటలకు మంటలు చెలరేగాయని, సాయంత్రం 5 గంటల కల్లా మందిరంలోని బోర్డు సభ్యులు, భద్రతా సిబ్బంది సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని సమాచారం. 

 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం