భార్యను ఏటీఎం యంత్రంలా వాడుకోవడం మానసిక వేధింపులతో సమానం.. కర్ణాటక హైకోర్టు

Published : Jul 20, 2022, 10:11 AM IST
భార్యను ఏటీఎం యంత్రంలా వాడుకోవడం మానసిక వేధింపులతో సమానం.. కర్ణాటక హైకోర్టు

సారాంశం

భార్యాభర్తల సంబంధంమీద కర్ణాటక హైకోర్టు సంచలనం తీర్పు నిచ్చింది. భార్యను డబ్బులు సంపాదించే యంత్రంలా చూసే వ్యక్తినుంచి ఆమెకు విడాకులు మంజూరు చేసింది.   

కర్ణాటక : ఎలాంటి భావనాత్మక సంబంధం లేకుండా భార్య అంటే డబ్బులు అందించే ఏటీఎం యంత్రంలా వాడుకోవడం మానసిక వేధింపులతో సమానమని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను రద్దు చేసి.. మహిళ కోరిక మేరకు విడాకులను మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వ్యాపారం చేస్తానని డబ్బు కోసం ఒత్తిడి..
బెంగళూరులో1991లో వివాహం చేసుకున్న ఓ దంపతులకు 2001లో ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత వ్యాపారం చేస్తున్న భర్త అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. దీంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ సమయంలో భార్య ఉపాధి కోసం బ్యాంకు ఉద్యోగంలో చేరింది. 2008లో భర్త  దుబాయ్ లో సెలూన్ తెరుస్తానని అంటే రూ.60 లక్షలు ఇచ్చింది. కానీ, అక్కడ కూడా ఆ వ్యాపారంలో నష్టాలు రావడంతో భర్త మళ్ళీ ఇంటికి తిరిగి చేరుకున్నాడు. అంతేకాదు నిత్యం డబ్బులు కావాలని పీడిస్తూ వుండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది.

వివాహిత తాళిని తీయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనం.. మద్రాస్ హై కోర్టు

జడ్జీల ఆగ్రహం…
మంగళవారం ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ అలోక్ ఆరాదే, జేఎం.ఖాజీల ధర్మాసనం ఈ కేసును విచారించింది. భార్యతో ఆ భర్త ఎలాంటి అనుబంధం లేకుండా యాంత్రికంగా భర్త పాత్ర పోషిస్తున్నాడని మండిపడింది. ఆమెను కేవలం డబ్బులు ఇచ్చే ఏటీఎంగా వాడుకుంటున్నాడు అని జడ్జీలు పేర్కొన్నారు.  భర్త ప్రవర్తనతో భార్య మానసికంగా క్రుంగి పోయిందని.. ఇది మానసిక వేధింపులతో సమానం అని స్పష్టం చేశారు. కానీ ఫ్యామిలీ కోర్టు ఈ అంశాలను పరిగణించడంలో విఫలమైందని అన్నారు. కేసును కూడా సక్రమంగా విచారించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భార్య వాదనను పరిగనలోకి తీసుకున్న హై కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది. 

ఇలాగే జూలై 15న ఓ కేసులో మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు నిచ్చింది. భర్త నుంచి విడిపోయిన భార్య మంగళసూత్రంని తీసివేస్తే అది భర్తను మానసికంగా హింసకు గురిచేసినట్లేనని మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు బాధిత వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. ఈరోడ్‌లోని ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సి శివకుమార్‌ సివిల్‌ ఇతర అప్పీలును అనుమతిస్తూ న్యాయమూర్తులు వీఎం వేలుమణి, ఎస్‌ సౌంథర్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

శివకుమార్ తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ స్థానిక ఫ్యామిలీ కోర్టులో జూన్ 15, 2016 న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరాడు. ఈ కేసులో శివకుమార్ భార్య అయిన మహిళను విచారించినప్పుడు తాము విడిపోయేటప్పుడు మంగళసూత్రాన్ని తొలగించినట్లు అంగీకరించింది. అయితే, సూత్రాలు తీసివేయలేదని.. వాటి గొలుసును మాత్రమే తీసేసినట్టు వివరించింది. అయితే అలా ఎప్పుడు పడితే అప్పుడు తీసివేయడానికి లేదని దానికి కొన్ని పద్దతులు ఉన్నాయన్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?