
కేరళలో అమెరికా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఇటీవలే అమెరికా నుంచి కేరళకు వచ్చినట్లు సమాచారం. కొంత కాలంగా ఆమె ఒక ఆశ్రమంలో నివసిస్తోంది. ఈ విషయమై పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు కరునాగపల్లి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి.. దుష్ప్రవర్తన
అమెరికా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జూలై 31న జరిగిందని పోలీసులు తెలిపారు. ఆశ్రమం సమీపంలోని బీచ్‌లో ఆ మహిళ ఒంటరిగా కూర్చున్నదని, ఈ సమయంలో ఇద్దరు యువకులు మహిళ వద్దకు వచ్చి ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం.. కామాంధులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది.
ఈ ఘటనపై బాధితురాలు ఆగస్టు1న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కరుణగప్పల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.నిందితులను కొల్లం వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు తన సెలవులను గడపడానికి అమెరికా నుంచి జూలై 22న కేరళకు చేరుకుంది. ఇంతలో ఈ దారుణం జరిగింది.