సీఏఏపై ఇలా: ఢిల్లీ అల్లర్లపై తెలివిగా తప్పించుకున్న ట్రంప్

By Siva KodatiFirst Published Feb 25, 2020, 5:59 PM IST
Highlights

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై తాను మోడీతో మాట్లాడలేదని అయితే మత స్వేచ్ఛను కాపాడాలని మోడీకి చెప్పానని అన్నారు. అయితే ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు తన దృష్టికి వచ్చాయని ట్రంప్ స్పష్టం చేశారు. 

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై తాను మోడీతో మాట్లాడలేదని అయితే మత స్వేచ్ఛను కాపాడాలని మోడీకి చెప్పానని అన్నారు. అయితే ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు తన దృష్టికి వచ్చాయని ట్రంప్ స్పష్టం చేశారు.

మోడీ మాటలపై తనకు నమ్మకం ఉందన్న ఆయన.. ఢిల్లీ ఘటనలు భారతదేశ అంతర్గత విషయమని అగ్రదేశాధినేత వెల్లడించారు. ఇండియా ఇంతగా అమెరికాను ఎప్పుడూ అభిమానించలేదన్నారు. అహ్మదాబాద్‌లో ఇచ్చిన ఘనస్వాగతాన్ని తాను జీవితంలో ఎప్పటికీ మరచిపోనని ట్రంప్ తెలిపారు.

Also Read:మోడీ ఎంతో ఇమ్రాన్ అంతే: కాశ్మీర్‌పై ట్రంప్ వ్యాఖ్యలు ఇవీ

భారత్‌తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. మంగళవారం భారతీయ మీడియాతో ట్రంప్ ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఇంధన రంగంలో భారత్‌లో పెట్టుబడులు పెరిగాయన్నారు.

భారత్‌లో తనకు అద్భుతమైన ఆతిథ్యం లభించిందని.. మోడీతో బలమైన స్నేహబంధం కుదిరిందని ట్రంప్ తెలిపారు. భారత్‌లోని సీఈవోలతో జరిగిన సమావేశం సంతృప్తినిచ్చిందన్న ఆయన భారత్‌ 140 కోట్ల మంది ప్రజల మార్కెట్ అన్నారు.

తాలిబన్లతో ఒప్పందం గురించి ప్రధాని మోడీకి వివరించానని.. అది ఇండియాకు కూడా సంతోషమేనన్నారు.   ప్రమోటర్లకు భారత్ స్వర్గధామమని, అలాగే ఈ దేశం శాంతిని కోరుకుంటుందని ఆయన తెలిపారు. భారత్ అధిక సుంకాలు విధిస్తోందంటూ అసహనం వ్యక్తం చేసిన ట్రంప్... సుంకాల విషయంలో ఇండియా ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 

Also Read:మళ్లీ నేనే గెలుస్తా, మార్కెట్లు లేస్తాయ్: భారతీయ కంపెనీల సీఈఓలతో ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఒక హైప్ మాత్రమేనన్నారు. మోడీ, నేను కరోనా వైరస్ గురించి చర్చించామని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పారు.

ఇక నుంచి ఇరాకే ఐసిస్‌ను కంట్రోల్ చేయాల్సి ఉంటుందని... ఆఫ్ఘనిస్తాన్‌లో తాము ఇక పోలిసింగ్ చేయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇస్లామిక్ రాడికల్స్‌ను అమెరికా ఇక నుంచి టార్గెట్ చేస్తుందని, అందులో భాగంగానే ఐసిస్ చీఫ్ అల్ బాగ్దాదీని అంతం చేశామని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.

 

click me!