తలకిందులుగా జాతీయ జెండా.. శశిథరూర్ పై ట్రోల్స్

By telugu teamFirst Published Jul 20, 2019, 9:46 AM IST
Highlights

సంజీవ్ భట్ కుటుంబానికి పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన.. వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న శ్వేతా భట్‌, ఆమె కొడుకు శంతనుతో జరిగిన భేటీ నన్ను కదిలించింది. ఆమె భర్త సంజీవ్‌ భట్‌ను నిర్బంధించడంపై మేం చర్చించాం. వారికి న్యాయం తప్పకుండా జరగాలి’అంటూ శశి ధరూర్‌ ట్వీట్‌ చేశారు.
 
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. జాతీయ జెండాను అవమానించారంటూ ఆయనను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే... శుక్రవారం శశిథరూర్... ఇటీవల జైలుపాలైన మాజీ ఐసీఎస్ అధికారి సంజీవ్ భట్ భార్య, కుమారుడితో భేటీ అయ్యారు.

సంజీవ్ భట్ కుటుంబానికి పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన.. వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న శ్వేతా భట్‌, ఆమె కొడుకు శంతనుతో జరిగిన భేటీ నన్ను కదిలించింది. ఆమె భర్త సంజీవ్‌ భట్‌ను నిర్బంధించడంపై మేం చర్చించాం. వారికి న్యాయం తప్పకుండా జరగాలి’అంటూ శశి ధరూర్‌ ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్ తోపాటు వారితో భేటీ అయిన ఫోటోని శశిథరూర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే... ఆ ఫోటోలో పెద్ద తప్పు జరిగింది. శశిథరూర్ ఛాంబర్ లోని టేబుల్ పై జాతీయ జెండా తలకిందులుగా ఉంది. దానిని గమనించిన నెటిజన్లు..ఆయనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. జాతీయ జెండాను కించపరుస్తారా అంటూ విపరీతంగా మండిపడుతున్నారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Had a moving meeting yesterday with courageous ShwetaBhatt & her brave son Shantanu to discuss the prolonged detention of her husband ⁦⁩. Justice must be done! pic.twitter.com/8BHUBRpzEa

— Shashi Tharoor (@ShashiTharoor)

click me!