కరోనా కట్టడిలో యూపీ సర్కార్ పనితీరు అసమానమైంది: వారణాసిలో మోడీ

By narsimha lodeFirst Published Jul 15, 2021, 12:32 PM IST
Highlights


కరోనా కట్టడిలో యూపీ పనితీరు అసమానమైందని ప్రధాని మోడీ చెప్పారు. వారణాసిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మోడీ గురువారం నాడు  పాల్గొన్నారు. యూపీలో ఇప్పటివరకు అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిందని ఆయన గుర్తు చేశారు. 


వారణాసి: కరోనా సెకండ్ వేవ్ ను అరికట్టడంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అద్బుతంగా పనిచేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కరోనా కట్టడిలో యూపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. గురువారం నాడు వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

కన్వర్ యాత్రకు యూపీ ప్రభుత్వం అనుమతివ్వడంపై సుప్రీంకోర్టు నోటీసులు  జారీ చేసింది.ఈ నోటీసులు జారీ చేసిన మరునాడే ప్రధాని మోడీ కరోనా విషయంలో యూపీ సర్కార్ పనితీరును అభినందించారు.కరోనా తొలి వేవ్ సమయంలో యూపీలో  రోజుకు కనీసం 7,016 కేసులు నమోదయ్యాయి. రెండవ వేవ్ లో రోజూ 30 వేల కేసులు రికార్డయ్యాయి. అయినా కూడ ప్రస్తుతం కోవిడ్ ను కట్టడి చేసింది యోగి సర్కార్. దీంతో కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొందని రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ అభినందించారు. 

యూపీ లో అత్యధిక జనాభా  ఉంది.  అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రంలో కరోనాను నియంత్రించేందుకు  యూపీ సర్కార్ వ్యవహరించిన తీరు  అసమానమైందని మోడీ చెప్పారు. రాష్ట్రంలోని ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైద్యులను ఆయన అభినందించారు. దేశంలో అత్యధిక వ్యాక్సినేషన్ చేసినందుకు గాను ఆయన యూపీ సర్కార్ ను అభినందించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.89 మంది వ్యాక్సిన్ వేయించుకొన్నారు.వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

click me!