ముగ్గురు పిల్లలను హత్య చేసి.. బావిలో  పడేసి కన్న తల్లి.. ఆపై ఇంటికి నిప్పంటించి..

ఉత్తరప్రదేశ్ లో  హృదయవిదాకర ఘటన చోటు చేసుకుంది. ఓ కన్న తల్లి తన ముగ్గురు బిడ్డలను బావిలో పడేసి చంపి.. తరువాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  

Google News Follow Us

ఓ తల్లి కన్న మమకారాన్ని మరిచింది.  కడుపున పెట్టి కాపాడుకోవాల్సిన పిల్లలను హత్య చేసి..  బావిలోకి తోసేసింది. అనంతరం తన ఇంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యం చేసుకుంది. కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. మంటలు ఆర్పిన తర్వాత ముగ్గురు పిల్లలను బావిలో పడేసినట్లు తల్లి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికితీసి చర్యలు చేపట్టారు. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్  ప్రాంతంలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్జాపూర్ జిల్లా సంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పజ్రా గ్రామంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో సుధ అనే వివాహిత తన భర్త అమర్జీత్‌తో ఫోన్‌లో మాట్లాడింది. భర్త ముంబైలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఫోన్‌లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఏదో వాగ్వాదం జరిగింది. వాగ్వాదం అనంతరం.. ఆమె తన ముగ్గురు బిడ్డలు  ఆకాష్, కృతి, అన్నులను హత్య చేసి.. బావిలో పడేసింది. అమాయక చిన్నారులను బావిలో పడేసిన తర్వాత ఆమె ఇంటికి తాళం వేసుకుని నిప్పంటించుకుంది. మంటలను చూసి కేకలు విని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. ఎలాగోలా మంటలను అదుపు చేసి, ఆమెను కాపాడారు.  

మంటలు ఆర్పిన తర్వాత ఇంట్లో పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అడగ్గా.. ముగ్గురినీ బావిలో పడేసినట్లు తల్లి తెలిపింది. బంధువులు బావిలో చూడగా కృతి, అన్న మృతదేహాలు నీటిలో కనిపించాయి. గ్రామస్థుల సహాయంతో బంధువులు వారిద్దరి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆకాష్ మృతదేహాన్ని బయటకు తీశారు. 

ఈ ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఆపరేషన్) ఓపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ కలహాల వల్ల ఆ మహిళ తన ముగ్గురు అమాయక పిల్లలను బావిలో పడేసిందని,  తల్లిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఆమెను అరెస్టు చేసేందుకు అన్వేషణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. వృత్తిరీత్యా కూలీ అయిన అమర్‌జిత్‌కు అతని భార్య చందతో సత్సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు.

వీరికి తరచూ వాగ్వాదాలు జరిగేవనీ, అలాంటి ఓ వాదన సమయంలో ఆ మహిళ కోపంతో ఈ తీవ్ర చర్య తీసుకుందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించామని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతున్నాయని తెలిపారు.