నేను బతికేఉన్నాను.. అధికారులను నిరూపించలేక వృద్ధురాలి ఆవేదన..!

By telugu news teamFirst Published Jun 5, 2023, 1:29 PM IST
Highlights

నిజానికి ఆమె ఒంట్లో కనీసం నడవడానికి కూడా సత్తువ లేదనే విషయం చూస్తేనే అర్థమౌతోంది. ఆ వయసులో ఆమె అధికారులను బతిమిలాడుతోంది. 

ఒక మనిషి కళ్ల ముందు కనపడుతున్నా, తాను బతికే ఉన్నాను అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా దారుణం. ఓ 70ఏళ్ల వృద్ధురాలికి అదే పరిస్థితి ఏర్పడింది. ఒంట్లో పనిచేసుకోని బతకడానికి సత్తువ లేదు. కడుపు నిండా తిండి పెట్టడానికి అయినవారు ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం ప్రభుత్వమైనా పింఛన్ ఇస్తే, వాటితో బతుకుదామని అనుకుంది. కానీ ప్రభుత్వ లెక్కల్లో ఆమె చనిపోయింది. అందుకే వారు ఆమెకు పింఛను కూడా ఇవ్వడం లేదు. దీంతో, తాను బతికే ఉన్నానని అధికారులకు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లా తందేరా ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు అధికారులు నిర్వహించిన సంపూర్ణ సమాధాన్ దివాస్ కార్యక్రమానికి హాజరైంది. నిజానికి ఆమె ఒంట్లో కనీసం నడవడానికి కూడా సత్తువ లేదనే విషయం చూస్తేనే అర్థమౌతోంది. ఆ వయసులో ఆమె అధికారులను బతిమిలాడుతోంది. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఆమె పింఛన్ కోసం తిరుగుతోందట. తాను పింఛన్ కి అర్హురాలిని అని, తనకు ఇప్పించమని అడుగుతోంది.

కానీ, ప్రభుత్వ లెక్కల్లో ఆమె చనిపోయినట్లు ఉందట. అందుకే ఆమెకు పింఛన్ ఇవ్వడం లేదు. దీంతో, తాను బతికే ఉన్నానని చెప్పడానికి ఏదైనా సర్టిఫికెట్ ఇవ్వమని కోరడం గమనార్హం.

ఆమె అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా పేర్కొంది. తన భర్త బాబు రామ్ ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయాడట.  అతనికి 28భిగాల స్థలం ఉంటే అందులో 23 భాగి ని కూతురిపేరు మీద రాశాడు. మిగిలిన ఐదు బిగా, ఇంటిని ఆమె పేరు మీద రాశాడట. అయితే.. తన భర్త చనిపోయిన తర్వాత తన కూతురు, అల్లుడు ఆమెకు తెలీకుండా, ఆమె చనిపోయిందని నమ్మించి, ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని కూడా వారే రాయించుకున్నారట.

ఆస్తి వారు లాక్కోవడంతో ఆమెకు నిలువ నీడ, తినడానికి తిండి లేకుండా పోయింది. అప్పటి నుంచి ఆమె తాను బతికున్నానని అధికారులను నమ్మించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఎన్నోసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఏ మాత్రం ప్రయోజనం దొరకలేదట. తన భర్త బ్యాంకులో కొంత డబ్బు దాచుకుంటే, వాటిని కూడా వాళ్లే లాక్కున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, అధికారులు ఈ సమావేశంలో ఆమె ఫిర్యాదును స్వీకరించి, దర్యాప్తు చేపడతామని చెప్పడం గమనార్హం.
 

click me!