కీచక ప్రధానోపాధ్యాయుడు.. 5 వ తరగతి చిన్నారులపై లైంగిక దాడులు..

By Rajesh Karampoori  |  First Published Oct 15, 2023, 7:30 AM IST

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వారి బంగారు భవిష్యత్తుకు దారి చూపాల్సిన గురువే వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 


విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితక్కువ పని చేసాడు. చదువు చెప్పే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సివాడు కామంతో కళ్లుమూసుకుపోయి నీచంగా ప్రవర్తించాడు. ఇలా విద్యార్థినిపై ఓ కీచక ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులకు దిగిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ  ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళ్తే.. షాజహాన్‌పుర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 5వ తరగతి చదువుతున్న చిన్నారుల పట్ల నీచంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడు అన్ని పరిమితులను దాటి చిన్న బాలికలతో అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ చిన్నారిపై లైంగికదాడి  చేశాడు. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆ చిన్నారులకు డబ్బులు ఇచ్చేవాడు.

Latest Videos

కానీ ప్రధానోపాధ్యాయుడి ఆగడాలు రోజురోజుకు మితిమిరిపోవడంతో ఈ కీచక దుశ్చర్యలు బట్టబయలు అయ్యాయి. దీంతో బాలిక ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు చేశారు.  తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు.

 గతంలోనూ విద్యార్థినులతో టీచర్ అసభ్యకర చర్యలు చేశాడనీ,   చాలామంది బాలికలతో అతడు ఇలాగే ప్రవర్తించినట్లు తేలింది. ఉపాధ్యాయుడిని వేధించినందుకు తల్లిదండ్రులు చాలాసార్లు క్షమించారని, అయినా నిందితుడు ఉపాధ్యాయుడు అతని చర్యలను మానుకోలేదని చెబుతున్నారు. దీంతో బాలిక ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లిదండ్రులు పోలీసులకు కేసు నమోదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ప్రధానోపాధ్యాయుడు ఆసిఫ్‌ జమాల్‌ను ఉద్యోగం నుంచి సస్పెండు  చేశామని, ఓ కమిటీ ద్వారా విచారణ జరిపిస్తామని విద్యాశాఖ అధికారి రణవీర్‌సింగ్‌ తెలిపారు.
 

click me!