గన్ మన్ ను ప్రత్యర్థిగా సృష్టించి దాడి బుకాయింపు: పోలీసులకు చిక్కిన పూజారి

By telugu teamFirst Published Oct 18, 2020, 7:54 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో జరిగిన ఓ కుట్రను పోలీసులు ఛేదించారు. పూజారిపై దాడికి నకిలీ దాడిని సృష్టించి ప్రత్యర్థులను ఇరికించే ప్రయత్నాలను పోలీసులు బయటపెట్టారు.

లక్నో: ఓ పూజారి, మరికొంత మంది చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గోండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఓ షూటర్ ను తన ప్రత్యర్థిగా సృష్టించి, తనపై దాడి జరిగిందని పూజారి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఆలయ పూజారిని, గ్రామను పెద్దను అరెస్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. 

గత వారం జరిగిన దాడిలో గాయపడిన పూజారి అతుల్ త్రిపాఠి అలియాస్ సామ్రాట్ దాస్ ప్రస్తుతం లక్నోలని కింగ్ జార్జెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేయడానికి గాయపడిన పూజారి, గ్రామ పెద్ద ఆలయంపై దాడి చేయడానికి కుట్ర చేశారు 

ఈ సంఘటన తీవ్రమైన గొడవకు దారి తీసింది. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయోధ్య సన్యాసులు జిల్లాలోకి ప్రవేశించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. 

గ్రామంలోని శ్రీరామ్ జానకి ఆలయంపై అక్టోబర్ 10వ తేదీన జరిగిన దాడిలో దాస్ గాయపడ్డాడని జిల్లా మెజిస్ట్రేట్ నితిన్ బన్సాల్, పోలీసు సూపరింటిండెంట్ శైలేష్ కుమార్ పాండే సంయుక్త మీడియా సమావేశంలో ఆ విషయం చెప్పారు. 

హత్యాప్రయత్నం జరిగిందంటూ ఆలయానికి చెందిన మహంత్ సీతారామదాస్ మాజీ గ్రామ పెద్ద అమర్ సింగ్, ఆయన అనుచరులపై కేసు పెట్టాడు. వారిలో ఇద్దరిని మర్నాడు అరెస్టు చేశారు. అమర్ సింగ్ పరారీలో ఉన్నాడు. 

మూడు నాటు తుపాకులను, ఏడు లైవ్ కాట్రిడ్జ్ లను, ఓ ఖాలీ కాట్రిడ్జ్ ను, ఓ మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిర్రే మనోరమ గ్రామంలోని రామ్ జానకి ఆలయానికి 120 బీగాల భూమి ఉందని, దానిపై మాజీ గ్రామ పెద్ద అమర్ సింగ్ కు, మహంత్ సీతారామ్ దాసుకు మధ్య గొడవ సాగుతోందని పోలీసులు చెప్పారు. 

దాంతో తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి మహంత్ సీతారామ్ దాస్, వినయ్ సింగ్ ఈ ఘటనలో అమర్ సింగ్ ను ఇరికించాలని ప్రయత్నించారు. దాంతో పూజారిపై దాడికి వ్యూహరచన చేశారని, ఆ దాడిలో పూజారి మరణించకుండా గాయపడే విధంగా చూడాలని వ్యూహరచన చేశారు ఆ రోజు నిందితులంతా ఆలయం వద్ద గుమికూడారు. పథకాన్ని అందులో ముగ్గురు అమలు చేశారని పోలీసులు చెప్పారు. 

మహంత్ సీతారామ్ దాస్ నిద్రను నటిస్తూ పడుకుని ఉండగా, పూజారి సమ్మతితో అతనిపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. గన్ షాట్స్ ను విన్న గార్డ్స్ పరుగెత్తుకుని వచ్చారని, చీకట్లో పారిపోతున్న ముగ్గురిని టార్చిలైట్ వెలుతురులో చూశారు. మహంత్ సీతారామ్ దాస్ ఫిర్యాదు మేరకు తాము అరెస్టు చేసిన వ్యక్తులను వదిలేస్తామని పోలీసులు చెప్పారు. 

click me!