డ్రైవర్ అఘాయిత్యం': నడుస్తున్న కారులోంచి దూకేసిన మహిళలు

Published : Oct 18, 2020, 07:15 AM IST
డ్రైవర్ అఘాయిత్యం': నడుస్తున్న కారులోంచి దూకేసిన మహిళలు

సారాంశం

పంజాబ్ లోని అమృతసర్ లో ఇద్దరు మహిళలు నడుస్తున్న క్యాబ్ లోంచి కిందికి దూకేశారు. దీంతో వారు గాయపడ్డారు. క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి ప్రయత్నించడంతో వారు భయపడి దూకేశారు.

అమృతసర్: నడుస్తున్న కారులోంచి దూకేయడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై అఘాయిత్యానికి దిగడంతో వారిద్దరు క్యాబ్ లోంచి దూకేశారు. మరో మహిళ కూడా కారులో ఉంది. అయితే, ఆమెను స్థానికులు రక్షించారు. 

ఇద్దరు మహిళలు దూకేయడం చూసిన స్థానికులు కారును వెంటాడి, అడ్డగించి మూడో మహిళను రక్షించారు. డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంజిత్ ఎవెన్యూ ప్రాంతంలోని రెస్టారెంట్ కు వెళ్లడానికి మహిళలు క్యాబ్ ను బుక్ చేసుకున్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాబిన్ హాన్స్ చెప్పారు. 

మార్గమధ్యలో డ్రైవర్ ఓ మహిళపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె ప్రతిఘటిస్తున్న కొద్దీ వాహనం వేగం పెంచుతూ వచ్చాడు. ఆమెతో పాటు మరో మహిళ క్యాబ్ నుంచి కిందికి దూకేశారు. 

నడుస్తున్న కారులోంచి ఇద్దరు మహిళలు దూకేయడం స్థానికులు గమనించారు. వారు కారును వెంటాడి, అడ్డగించి మరో మహిళను రక్షించారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !