UP Assembly Election 2022 : ఢిల్లీలో బీజేపీ ఎంపీలతో మోదీ బ్రేక్ ఫాస్ట్.. యూపీలో అమిత్ షా ర్యాలీ..

Published : Dec 17, 2021, 11:14 AM IST
UP Assembly Election 2022 : ఢిల్లీలో బీజేపీ ఎంపీలతో మోదీ బ్రేక్ ఫాస్ట్.. యూపీలో అమిత్ షా ర్యాలీ..

సారాంశం

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎంపీలతో జరిగిన అల్పాహార విందు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిజెపి నేతలు ప్రహ్లాద్ జోషి, అర్జున్ మేఘ్వాల్, పి. మురళీధరన్‌లు పాల్గొన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీతో కలిసి యూపీలో శుక్రవారం మధ్యాహ్నం ‘సర్కార్ బనావో, అధికార్ పావో’ ర్యాలీలో  ప్రసంగించనున్నారు.

న్యూఢిల్లీ :  ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. బిజెపి నేతలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం బిజెపి ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ సమావేశం జరిపారు.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎంపీలతో జరిగిన అల్పాహార విందు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిజెపి నేతలు ప్రహ్లాద్ జోషి, అర్జున్ మేఘ్వాల్, పి. మురళీధరన్‌లు పాల్గొన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీతో కలిసి యూపీలో శుక్రవారం మధ్యాహ్నం ‘సర్కార్ బనావో, అధికార్ పావో’ ర్యాలీలో  ప్రసంగించనున్నారు.

CTET 2021 Exam వాయిదా: త్వరలోనే పరీక్ష తేదీల ప్రకటన

లక్నో లో జరిగే ఈ ర్యాలీలో హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దేవ్ సింగ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ తదితరులు పాల్గొంటారు. డిసెంబర్ నెల చివరి వరకు యూపీలోని మొత్తం 403 నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. 

ఇటీవల కాశీవిశ్వనాథ కారిడార్ ను ప్రారంభించారు. అక్టోబర్ 20న ప్రధాని మోదీ ఖుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 25న తూర్పు ఉత్తర ప్రదేశ్ లో తొమ్మిది మెడికల్ కాలేజీలో ప్రధాని మోడీ ప్రారంభించారు.  నవంబర్ 16న తూర్పు ఉత్తర ప్రదేశ్ జిల్లాలను రాష్ట్ర మధ్య భాగంతో కలిపి మెగా హైవే ప్రాజెక్ట్ అయిన పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ ను ఆయన ప్రారంభించారు.

మిస్ ఇండియా మానస వారణాసికి కరోనా.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా...

డిసెంబర్ 7న ప్రధానమంత్రి మోడీ తూర్పు ఉత్తర ప్రదేశ్ లో ఎయిమ్స్ సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.  గోరక్ పూర్ లో ఒక ఎరువుల కర్మాగారానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.  డిసెంబర్ 28న ప్రధాని కాన్పూర్లో పర్యటించనున్నారు. 
 
PREV
Read more Articles on
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu